సూర్యను ఫాలో అవుతున్నాడా..?

First Published 23, May 2018, 7:14 PM IST
saami movie motion poster released
Highlights

పోలీస్ స్టోరీస్, యాక్షన్ కథలను తెరకెక్కించడంలో దర్శకుడు హరి

పోలీస్ స్టోరీస్, యాక్షన్ కథలను తెరకెక్కించడంలో దర్శకుడు హరి ఆరితేరిపోయాడు. సూర్య హీరోగా వరుసగా సింగం సిరీస్ ను రూపొందించిన హరి ఇప్పుడు విక్రమ్ హీరోగా మరో పోలీస్ స్టోరీ  రూపొందిస్తున్నాడు. గతంలో విక్రమ్ హీరోగా హరి చేసిన సామి సినిమాకు ఇది సీక్వెల్.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో విక్రమ్ లుక్, మీసం చూస్తుంటే సింగం సినిమాలో సూర్యను ఫాలో అయినట్లుగా అనిపిస్తుంది. అయితే స్క్రీన్ ప్లే విషయంలో హరి స్పెషల్ ట్రీట్మెంట్ గనున ఆడియన్స్ కు నచ్చితే మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయం. 

loader