కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ఎందరో నిరాశ్రయులుగా మారినా వరుణుడు మాత్రం కరుణించడం లేదు. ఏకధాటిగా కురుస్తోన్న వానలతో అందరూ ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేక తమను ఆదుకునేవారి కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎందరో ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా వరద బాధితుల సహాయార్ధం నిధులు సమకూరుస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోల నుండి ప్రతి ఒక్కరూ తమవంతూ స్పందిస్తూ సహాయాన్ని అందిస్తున్నారు. తాజాగా 'RX100' సినిమా టీమ్ కూడా వరద బాధితులకు సహాయం చేయడానికి ముందుకొచ్చింది. పెద్ద మొత్తంలో డబ్బుని సమకూర్చడం కోసం ఓ వినూత్న ఆలోచన చేసింది చిత్రబృందం. 'RX100' సినిమాలో హీరో వాడిన బైక్ ని వేలం వేసి దాని ద్వారా వచ్చిన డబ్బుని కేరళ వరద బాధితులకు డొనేట్ చేయనున్నారు.

వేలంలో బైక్ మినిమమ్ ధర యాభై వేలుగా నిర్ణయించారు. వేలం పాటలో ఎంత డబ్బుకి ఈ బైక్ ని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారో.. ఆ ధరను rx100auction@gmail.com కి మెయిల్ గానీ లేదా 9100445588 కి వాట్సాప్ చేయమని తెలిపారు.  

 

ఇవి కూడా చదవండి.. 

నేను ఇక్కడ ప్రతి ఒక్కరినీ ముద్దుపెట్టుకోవడానికి రాలేదు.. 'RX100' హీరోయిన్ అసహనం!

ఆఫర్ ఇస్తా నాకేంటి అన్నాడు.. RX100 మూవీ హీరోయిన్!