ఆఫర్ ఇస్తా నాకేంటి అన్నాడు.. RX100 మూవీ హీరోయిన్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 19, Aug 2018, 7:19 PM IST
rx100 heroine about casting couch in tollywood
Highlights

RX100 సినిమాలో నేను బోల్డ్ గా నటించాడు. అందుకే అనుకుంటా ఆ సినిమా తరువాత కాస్టింగ్ కౌచ్ ఆఫర్లు వస్తున్నాయి. రీసెంట్ గా అలాంటి ఆఫర్ తో నన్ను ఒకరు కలిశారు

'RX100' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. తన బోల్డ్ పర్ఫార్మన్స్ తో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా రెట్టింపు లాభాలను తీసుకొచ్చింది.

ఈ సినిమాతో పాయల్ కి మరిన్ని అవకాశాలు వస్తాయని ఊహించారు కానీ ఇప్పటికీ ఆమెను కాస్టింగ్ కౌచ్ భూతం వెంటాడుతుందని చెప్పుకొని వాపోయింది పాయల్. 'టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే.అయితే నటిగా నిరూపించుకున్న తరువాత కూడా ఈ కాస్టింగ్ కౌచ్ నన్ను వెంటాడుతోంది' అంటూ బాధ పడుతోంది ఈ బ్యూటీ.

''RX100 సినిమాలో నేను బోల్డ్ గా నటించాడు. అందుకే అనుకుంటా ఆ సినిమా తరువాత కాస్టింగ్ కౌచ్ ఆఫర్లు వస్తున్నాయి. రీసెంట్ గా అలాంటి ఆఫర్ తో నన్ను ఒకరు కలిశారు. నీకు ఆఫర్ ఇస్తా.. మరి నాకేంటి..? అన్నాడు. షాక్ అయ్యాను. నా టాలెంట్ తో నేను నటిగా నిరూపించుకోవాలి అందుకే ఆ ఆఫర్ రిజక్ట్ చేశాను'' అంటూ తనకు ఎదురైన అనుభవాలని చెప్పుకొచ్చింది. 

loader