హీరో చేస్తామని డబ్బు తీసుకొని మోసం చేశారు: 'RX100' హీరో ఆవేదన

rx 100 movie hero karthikeya about cinema industry
Highlights

లక్ష రూపాయలు ఉంటే సినిమా వెంటనే రెడీ అవుతుందని మరికొందరు. వాళ్లని నమ్మి డబ్బు కూడా తీసుకెళ్లి ఇచ్చేవాడిని. కానీ సినిమా మాత్రం మొదలయ్యేది కాదు. ఇలా చాలా మంది నన్ను మోసం చేశారు. ఆ తరువాతే దర్శకుడు అజయ్ తో పరిచయం ఏర్పడింది. ఆయన సినిమా ద్వారానే హీరోగా పరిచయమయ్యాను

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా లేకుండా నెట్టుకురావడం కష్టమనే చెప్పాలి. ఇక ఇండస్ట్రీలో అవకాశాల కోసం కొత్తవారు పడే తిప్పలు మాములుగా ఉండవు. వారి బయోడేటా పట్టుకొని అన్ని సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడం, అందరిని అవకాశాల కోసం అడగడం ఇలా చాలా పనులు ఉంటాయి. కొందరైతే అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బు గుంజేవారు కూడా ఉంటారు.'RX100' హీరో కార్తికేయకు కూడా ఇలాంటి చేదు అనుభావాలే ఎదురయ్యాయట.

కొందరు తన దగ్గర డబ్బు తీసుకొని మోసం చేశారని వెల్లడించాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకి హాజరైన కార్తికేయ.. 'చిన్నప్పటి నుండి నాకు సినిమాలంటే పిచ్చి. చిరంజీవి గారంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం. ఇంద్ర సినిమా ఎన్ని సార్లు చూశానో, ఆయన డాన్సులు ఎంతసేపు ప్రాక్టీస్ చేశానో లెక్కేలేదు. సినిమాలోకి వెళ్తానని అమ్మా, నాన్నలను ఒప్పించి నటనలో శిక్షణ తీసుకున్నాను. ఏ సినిమా ఆడిషన్స్ జరుగుతున్నా..

అక్కడకి వెళ్లేవాడిని. కొందరు సినిమా త్వరలోనే మొదలవుతుందని చెప్పి నన్ను తిప్పించుకునేవాళ్లు. లక్ష రూపాయలు ఉంటే సినిమా వెంటనే రెడీ అవుతుందని మరికొందరు. వాళ్లని నమ్మి డబ్బు కూడా తీసుకెళ్లి ఇచ్చేవాడిని. కానీ సినిమా మాత్రం మొదలయ్యేది కాదు. ఇలా చాలా మంది నన్ను మోసం చేశారు. ఆ తరువాతే దర్శకుడు అజయ్ తో పరిచయం ఏర్పడింది. ఆయన సినిమా ద్వారానే హీరోగా పరిచయమయ్యాను'' అంటూ వెల్లడించారు. 

loader