BrahmaMudi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈరోజు మార్చి 2వ తేదీ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈరోజు ఎపిసోడ్ లో కావ్య గతంలో స్వప్న మాట్లాడిన మాటలు తలుచుకొని ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో కనకం బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అపర్ణ అది మనందరినీ మోసం చేసి వెళ్లిపోయింది అనడంతో కనకం దేవుడా ఏదో ఒక దారి చూపించు జీవితంలో మళ్లీ నేను అబద్ధాలు వాడను అంటూ లెంపలు వేసుకుంటూ ఉంటుంది. మరొకవైపు రుద్రాణి ఏంటండీ ఇది టైం సెన్స్ లేదా పెళ్లిచూపులు అలాగే వెయిట్ చేయించారు ఇప్పుడు పెళ్లిలో కూడా ఇలాగే వెయిట్ చేస్తున్నారు ఇది కరెక్టేనా అని అడగడంతో కావ్య వాళ్ళ నాన్న తలదించుకుంటాడు.
అప్పుడు కనకం వాళ్ళ అక్క తింగరి తింగరిగా సమాధానం చెబుతూ ఉంటుంది. అప్పుడు ఏంటి నస అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు రుద్రాణి కళ్యాణ్ ని పిలిచి ఈవిడకు నీ కవిత్వం వినాలని ఉంది ఒక్కసారి నీ కవిత్వం వినిపించు అనడంతో అప్పుడు కళ్యాణ్ ఆహా ఎంతటి భాగ్యం అనుకుంటూ ఉండగా అది చూసి రాజ్ వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు కళ్యాణ్ కవిత్వం చెప్పడంతో కనకం వాళ్ళ అక్క బిక్క మొఖం వేస్తుంది. ఏం అర్థం కాలేదు బాబు అన్నంతో మళ్ళీ చెప్పాలా అనగా అయ్యో వద్దు బాబు అని దండం పెడుతుంది. అది చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు రుద్రాణి పొద్దున స్వప్న కళ్ళు తిరిగి కిందపడిపోయింది అంట అనడంతో రాజ్ టెన్షన్ తో పైకి లేస్తుండగా పెళ్లి పీటల నుంచి లేకూడదు నాన్న అనడంతో మౌనంగా కూర్చుంటాడు.
అప్పుడు కనకం తన మనసులోని మాటలు అన్నీ చెబుతూ ఉండగా రుద్రాణి అక్కడికి వచ్చి కనక మాటలు విని షాక్ అవుతుంది. అప్పుడు రుద్రానికి టెన్షన్ పడుతూ ఉంటుంది. కావ్య అపర్ణను చూసి మిగతా ఇద్దరు కూతుర్లు వీళ్లేనా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఎవరితో ఏమని చెప్పాలి అని కనకమంటుండగా ఇంతలో ఏమీ తెలియనట్టుగా రుద్రాణి అక్కడికి స్వప్న అని పిలుస్తూ వస్తుంది. స్వప్న ఎక్కడికి వెళ్ళింది అందరూ మండపంలో ఎదురు చూస్తుంటే మీరేంటి ఇక్కడ కూర్చున్నారు అని అడగడంతో కనకం టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు రుద్రానికి తానే క్వశ్చన్లు వేసి తానే సమాధానం చెబుతూ ఉండగా కావ్య వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఓహో స్వప్న పెళ్లిచూపులప్పుడు వెళ్లినట్లు ఇప్పుడు కూడా బ్యూటీ పార్లర్ కు వెళ్లిందా అని అనడంతో కనకం టెన్షన్ పడుతూ ఉంటుంది.
ఇప్పుడు వస్తుందా రాదా అనగా వస్తుంది ఇప్పుడే వస్తుంది అని కంకణం కనకం టెన్షన్ పడుతూ ఉండగా లేచిపోయిన అమ్మాయి ఎలా వస్తుంది అని అంటుంది రుద్రాణి. అప్పుడు రుద్రాణి మాటలకు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు అపర్ణ ఎవడితోనో కార్లో వెళ్ళిపోయింది అనడంతో పెళ్లికూతురు పెళ్లి నుంచి పారిపోయింది అంటే ఎవరైనా లేచిపోయిందని అంటారు అనగా కనకం అవమానంతో తల దించుకుంటుంది. ఏంటి కనకం వీరిద్దరు నీ కూతుర్లు కాదు ఎవరో తెలియదు అన్నట్టుగా ప్రవర్తించావు. కుండలకు రంగులేసుకునే నీ భర్తని తీసుకువచ్చి బిజీబిజీ అన్నావు ఈమె ఎవరో తెలియదు అన్నట్టుగా మాట్లాడావు.
ఇప్పుడు ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్పాలి పద వెళ్దాం పద అని రుద్రాణి అనగా అప్పుడు కావ్య ఒక్క నిమిషం ఆగండి మా అమ్మ ఉరివేసుకోబోతే నేనే వచ్చి ఆపాను అని అనడంతో అవతల మీడియా వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు దుగ్గిరాల ఫ్యామిలీలోకి కోడలిగా రావాలి అంటే ఆశా మాసి అనుకుంటున్నారా పరువు మొత్తం ఏమి అవ్వాలి అని అంటుంది రుద్రాణి. మా కుటుంబంలో ఇలాంటి దరిద్రం ఎప్పుడు జరగలేదు అంటూ రుద్రాణి కనకం వాళ్ళని ఇంకా బాధపెట్టే విధంగా మాట్లాడుతుంది. మా నాన్న మా కుటుంబ పరువు కి ఎంతో మర్యాద ఇస్తారు ఇన్ని అబద్ధాలు చెప్పి చేసిన దానివి ఈ పెళ్లి ఎలాగో అలా జరిపించు అని అంటుంది రుద్రాణి.
అప్పుడు అపర్ణ నేను వెళ్లి మా అక్కని తీసుకొస్తాను అనడంతో నువ్వు వెళ్లే వరకు అక్కడ అందరూ అలాగే కూర్చోరు కదా పంతులుగారు పెళ్లికూతురుని తీసుకొని రమ్మని చెప్పి గోల గోల చేస్తున్నారు అని అంటుంది రుద్రాణి. ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుంది ఏదో ఒకటి చేయాలి కనకం ఏదో ఒకటి ఆలోచించు అని కనకం ని మీకు టెన్షన్ పెడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి నేను ఏం చేయాలో మీరే చెప్పండి నా కూతురు ఇలా మాట మార్చి నా హాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది దాని బదులు దీన్ని వెళ్లి పీటల మీద కూర్చోబెట్టలేను కదా అని అనడంతో నా ఆలోచన కూడా అదే అని అంటుంది రుద్రాణి. కూర్చోబెట్టు అనడంతో కనకం, కావ్య ఇద్దరు ఒకసారిగా షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నారు అనగా నువ్వు వెళ్లి పెళ్లి పీటల మీద కూర్చో నువ్వు వెళ్లి మీ అక్కని తీసుకొని రా అని అంటుంది రుద్రాణి.
ఒక వైపు కళ్యాణ మండపంలో అందరూ టెన్షన్ గా ఎదురు చూస్తూ ఉంటారు. రుద్రాణి వెళ్ళి కూడా చాలా సేపు అయింది ఇంకా రాలేదేంటి అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. మరోవైపు కనకం నా కూతురు కావ్యకి రాజ్ కి ఒక క్షణం కూడా పడదు ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. మరి ఈ విషయం చెప్పేదాము ఏ గొడవ జరగకుండా మీలో ఎవరైనా ఆపగలరా చెప్పండి మాట్లాడండి అని నిలదీస్తుంది రుద్రాణి. ఏదేంటి వారు అయిన మీరు గొప్పింటి వాళ్లు అని చెప్పి అన్ని విషయాలలో ముసుగు వేశావు కదా ఇప్పుడు నీ కూతురికి కూడా పెళ్లికి ముస్తాబు చేసి ముసుగు వేయి అని అంటుంది. మరోవైపు రాజ్ అసలు ఎందుకు స్వప్న రావడం లేదు అని టెన్షన్ గా పడుతూ ఉంటాడు.
ఇంతలోనే అక్కడే ఉన్న ముత్తైదువులు వదిన ఏ పెళ్ళిలో కూడా ఇలా జరగలేదు అంటూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉండగా వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. మరొకవైపు ఏంటి మాట్లాడటం లేదు తప్పులు చేసింది మీరు నన్ను వెయిట్ చేయిస్తున్నారు. ఒకటి మాట్లాడండి లేదంటే నేను వెళ్లి నిజం చెప్పేస్తాను అనడంతో వద్దమ్మా ఆగండి చెప్పినట్టుగా మీరు చెప్పినట్టు మా కావ్య ని పెళ్లి పీటల మీద కూర్చో పెడతాను అనడంతో కావ్య షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ అమ్మ అనడంతో నేనేం మాట్లాడలేను నన్ను వదిలేస్తే చచ్చిపోయేలా ఉన్నాను అని ఏడుస్తూ మాట్లాడుతుంది. మరోవైపు మండపంలో రాజ్ వాళ్ళ నాన్న కావ్య వాళ్ళ నాన్న పై సీరియస్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు కనకం చేసేదేమీ లేక కావ్యని చేతులు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటుంది. అప్పుడు రుద్రాణి ప్లాన్ చెబుతూ పెళ్లికూతురుగా రెడీ అయ్యి మీ వంశాచారమని చెప్పి ముసుగు వేసుకొని రా అని చెబుతుంది. అప్పుడు కనకం బతిమిలాడటంతో కావ్య సారీ అని పెళ్లి పీటల మీద కూర్చోడానికి ఒప్పుకుంటుంది..
