రూరల్ బెల్ట్ ని వదిలేసి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు సిటీల్లో ఉండే టైర్ 2, టైర్ 3 ని కూడా వదిలేస్తున్నాం. సౌత్ ఇండియన్ డబ్బింగ్ సినిమాలు మెట్రోలు, నాన్ మెట్రోలును టార్గెగ్ చేస్తున్నాయి.
సంక్రాంతికి రిలీజ్ అవుతున్న భారీ బడ్జెట్టు చిత్రాలలో ఒకటి 'ఆర్ఆర్ఆర్'. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కున అసలుసిసలు మల్టీస్టారర్ ఇది. స్టార్ కేస్టింగ్ పరంగా చూసినా.. నిర్మాణం పరంగా చూసినా .. ఏ విధంగా చూసినా భారీ చిత్రం ఇది. ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ప్యాన్ ఇండియా చిత్రం కావటంలో హిందీలోనూ ఈ సినిమా భారీగా విడుదల కానుంది. అక్కడా ప్రమోషన్స్ భారీ ఎత్తున చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించి బాలీవుడ్ ప్రముఖ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ చేసిన ఓ కామెంట్ వైరల్ అవుతోంది. అది ఈ సినిమాతో ...బాలీవుడ్ కు డేంజర్ లైట్ పడబోతోందని హెచ్చరించారు.
తరుణ్ ఆదర్శ్ ఏమంటారంటే...“బాలీవుడ్ పూర్తిగా మెట్రో సెంట్రిక్ సినిమాలు చేయటంలో బిజీగా ఉంది. రూరల్ బెల్ట్ ని వదిలేసి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు సిటీల్లో ఉండే టైర్ 2, టైర్ 3 ని కూడా వదిలేస్తున్నాం. సౌత్ ఇండియన్ డబ్బింగ్ సినిమాలు మెట్రోలు, నాన్ మెట్రోలును టార్గెగ్ చేస్తున్నాయి. కేజీఎఫ్, బాహుబలి, పుష్ప హిందీ ఇప్పటికే గెలుచుకున్నాయి...ఆర్ ఆర్ ఆర్ కోసం వెయిట్ చేస్తున్నాం ,” అని తేల్చి చెప్పేసారు. ఇది నిజమేనంటూ హిందీ వర్గాలు వారు అంటున్నారు.
ఈ చిత్రం కి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక ముంబై లో జరగడం విశేషం. ఈ వేడుక కి సల్మాన్ ఖాన్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ముఖ్య అతిథిగా వచ్చిన సల్మాన్ ఖాన్ ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల అయిన నాలుగు నెలల వరకు ఏ ఇండియా ఫిల్మ్ ను రిలీజ్ చేయడానికి సాహసించకండి అని వ్యాఖ్యానించారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
Also read Rajamouli about RRR: `ఆర్‌ఆర్‌ఆర్` పునాది రహస్యం చెప్పిన జక్కన్న.. కలెక్షన్ల నెంబర్ ఆలోచిస్తారట
కరణ్ జోహార్ ఈ ఈవెంట్ కి వ్యాఖ్యాత గా వ్యవహరించగా, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో పాటుగా అలియా భట్, శ్రియ శరణ్ లు వేడుక కి హాజరు అయ్యారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటించగా, అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్ర ఖని, శ్రియ శరణ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
