సౌత్  మల్టీస్టారర్ గా రాబోతున్న భారీ బడ్జెట్ RRR వచ్చే వరకు సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరుగుతూనే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు ఒకే తెరపై ఎలా కనిపిస్తారు అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా బాహుబలి కంటే భారీ స్థాయిలో 300కోట్లకు పైగా ఖర్చు చేసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

మరి బడ్జెట్ ఆ లెవెల్లో ఉంటే దర్శకుడు రాజమౌళి చేసే ప్రమోషన్స్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మెయిన్ గా హీరోల లుక్స్ తోనే రాజమౌళి గట్టి బజ్ క్రియేట్ చేస్తాడు. ఇక కీరవాణి సంగీతం సినిమాలో ప్రధాన ఆయుధమని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. RRRకోసం మ్యూజిక్ లో స్పెషల్ టెక్నీక్స్ వాడుతున్నట్లు సమాచారం. 

ఇక రామ్ చరణ్ - తారక్ ల మధ్య ఉండే ఒక ప్రమోషనల్ సాంగ్ కోసం కూడా జక్కన్న టీమ్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా తారక్ చరణ్ ఆ సాంగ్ లో టాప్ సింగర్స్ తో కోరస్ అందుకుంటారని టాక్. ఇదివరకే తారక్ తన గాత్రంతో మెప్పించిన సంగతి తెలిసిందే. కానీ చరణ్ మాత్రం ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ సారి ఇద్దరు కలిసి RRR కోసం రెడీ చేస్తోన్న స్పెషల్ ట్యూన్ లో పాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

రానున్న తెలుగు సినిమాల రిలీజ్ డేట్స్.. (అప్డేట్)