ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. కొత్త పోస్టర్లని పంచుకున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`లోని ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కొత్త లుక్‌లను విడుదల చేశారు. 

ఇండియన్‌ ప్రిస్టీజియస్‌ చిత్రాల్లో `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie) ముందు వరుసలో ఉంది. ఈ సినిమా వైపే అందరి చూపు ఉంది. సినిమా కోసం ఇండియన్‌ ఆడియెన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ అన్ని భాషల్లోనూ అంచనాలను పెంచేసింది. ఆడియెన్స్ లో గూస్‌బంమ్స్ సృష్టించింది. RRRపై అంచనాలకు ఇప్పుడు ఆకాశమే హద్దైంది. పైగా ఇప్పటికే ముంబయి, హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరులో ప్రెస్‌మీట్‌లతో సందడి చేసింది `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌. రాజమౌళి వరుసగా పలు షోస్‌లో, ఈవెంట్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. 

అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. కొత్త పోస్టర్లని పంచుకున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`లోని ఎన్టీఆర్‌(Ntr), రామ్‌చరణ్‌(Ram Charan) కొత్త లుక్‌లను విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్‌ బుల్లెట్‌ బైక్‌పై దూసుకొస్తున్నారు. ఆయన ముఖంలో ఆనందం కనిపిస్తుంది. ఎన్టీఆర్‌ అలా దూసుకొస్తుంటే.. చరణ్‌ మాత్రం కూల్‌గా ఉన్నారు. పోస్టాఫీస్‌ బాక్స్ వద్ద నిల్చొని అలా ఓ లుక్‌ ఇచ్చారు. వీరిద్దరు 1920నాటి గెటప్స్ లో కనిపిస్తుండటం విశేషం. ఈ లుక్స్ అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ఎన్టీఆర్‌ బుల్లెట్‌పై వస్తుంటే, ఆయన్ని చూస్తున్నట్టుగా చరణ్‌ పోస్ట్ ఉండటం విశేషం. 

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో ఎన్టీఆర్‌.. కొమురంభీమ్‌ పాత్రలో, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. వీరిద్దరు కలిసి బ్రిటీష్‌కి వ్యతిరేకంగా పోరాడటం నేపథ్యంలో స్నేహం ప్రధానంగా సాగే చిత్రమిది. 1920 బ్యాక్‌ డ్రాప్‌లో సాగబోతుంది. చరణ్‌కి జోడీగా సీత పాత్రలో అలియాభట్‌ నటిస్తుండగా, ఎన్టీఆర్‌కి పెయిర్‌గా బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ నటిస్తుంది. అజయ్‌ దేవగన్‌, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాని పది భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించి బిజినెస్‌ పూర్తయ్యినట్టు తెలుస్తుంది. సినిమాని డీవీవీ దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 

also read: Unstoppable Promo: బాలయ్యకి చుక్కలు చూపించిన రాజమౌళి.. నాలుక కర్చుకున్న `అఖండ` స్టార్‌