Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్ ఎవరో తెలియదు.. ఆర్‌ఆర్‌ఆర్‌ నటుడి మాటలకు అర్ధం అదేగా..?

పాన్ ఇండియా రేంజ్ లో టాలీవుడ్ హీరోల గురించి తెలియనివారు ఉండరు. మరీ ముఖ్యంగా మన ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఎవరో తెలియదుఅని ఎవరైనా అంటారా..? తాజాగా ఓ నటుడు ఆ మాట అన్నంత పనిచేశాడు. 
 

RRR Actor Edward Sonnenblick Comments On NTR and Ram Charan JMS
Author
First Published Jan 10, 2024, 8:35 AM IST


రామ్ చరణ్ , ఎన్టీఆర్ ఈ ఇద్దరు తెలియని వారు ఉంటారా చెప్పండి. అందులోనే ఆర్ఆర్ఆర్ హిట్ తరువాత ఈ ఇద్దరిగగురించి  దేశంలో ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. దేశంలో ఏ భాషలో అయినా.. ఏ నటులుఅయినా.. ఏదో ఒక సందర్భంలో మాట్లాడాల్సి వస్తే.. ఈ హీరోల గురింజి పాజిటీవ్ గానే మాట్లాడతారు. అయితే చిత్రం ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన ఓనటుడు మాత్రం ఈ హీరోలను గుర్తించలేకపోయాడు. అంటే మర్చిపోయాడు పాపం. 

మీకు ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్‌.. తెలుసా..?  ఈయనెవరో చాలా మందికి తెలియకపోవచ్చు.  కాని ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఎడ్వార్డ్ క్యారెక్టర్ మాత్రం అందరికి తెలుసు.. ఆ ఎడ్వార్డ్ పాత్ర పోషించింది ఇతనే.  ఇతనిది దక్షిణ కాలిఫోర్నియా. నటన అంటే ప్రాణం. ఇండియాన్ సినిమాల్లో నటించాలనే కుతూహలం ఎక్కువ.. అందకే ఇక్కడికి వచ్చాడు.ముంబయల్ లో సెటిల్ అయ్యాడు..కాని సౌత్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నాడు. హిందీ బాగా మాట్లాడతాడు కూడా. అయితే ఈ నటుడు తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే..? 

ప్రస్తుతం ధనుష్‌ నటిస్తున్న కెప్టెన్‌ మిల్లర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు సినిమా ప్రమోషన్‌లలో పాల్గొంటున్నారు. పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న అమెరికన్‌ నటుడు ఎడ్వర్డ్‌ సోన్నెన్‌బ్లిక్ కూడా ఇంటర్వ్యూలిస్తున్నాడు. ధనుష్ సినిమా పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కింది.దాంతో ఈ సినిమాలో కూడా ఎడ్వర్డ్ కు బ్రిటిష్‌ అధికారి పాత్ర దొరికింది. 

ఇండస్ట్రీకి మరో నేషనల్ క్రష్ దొరికింది, ఎవరీ మేధా శంకర్..

ఈమూవీ ప్రమోషన్స్ లో కూడా పాల్గోంటున్నాడు ఎడ్వర్డ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.  ప్రస్తుతం మీరు చేస్తున్నసినిమా హీరో ధనుష్‌ కాకుండా.. మీకు ఇంకా ఏఏ హీరోలు తెలుసు? అని  ప్రశ్న ఎదురయ్యింది. అంతే కాదు ఆయన ముందు   అజిత్‌, సూర్య, విజయ్‌ ఫోటోలు కూడా పెట్టారు యాంకర్.అయితేఅతను అందులో  విజయ్‌ను మాత్రమే గుర్తుపట్టాడు. 2005లోనే విజయ్‌ సినిమాలు తాను చూశారన్నారు ఎడ్వర్డ్‌ సోన్నెన్‌బ్లిక్‌.

మరి ఆర్ఆర్ఆర్ సినిమాలో చేసిన ఎడ్వార్డ్ కు ఆస్కార్ సాధించిన ఆర్ఆర్ఆర్ నటులు తెలియదా అని నెటిజన్లు అంటున్నారు. అయితే యాంకర్ ఆహీరోల ఫోటోలు ముందు పెట్టబట్టి ఆ మాట అన్నారు కాని.. ఇంత కాలం ఇండస్ట్రీలో ఉన్న అతనికి ఇంకే హీరో తెలియదా అనిప్రశ్న మొదలయ్యింది. అందులోను ఎడ్వార్డ్ తెలుగుసినిమాలు కూడా చేశాడు. తెలుగులో రాజన్న, షిర్డిసాయి, కేసరి, సామ్‌ బహదూర్‌, మణికర్ణిక వంటి సినిమాల్లో నటించాడు. 

హీరోగా మహేష్ బాబు మరో మేనల్లుడు, కొడుకు ఎంట్రీపై సుధీర్ బాబు క్లారిటీ..

అయితే అటు విజయ్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో గురించి గొప్పగా ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది. తమ హీరో రేంజ్ ప్రపంచ వ్యాప్తంగా  ఉన్న ప్రజలకు తెలుసు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాని గతంలో ఇదే ఎడ్వర్డ్ రామ్ చరణ్, ఎన్టీఆర్ లను సౌత్ ఆడియన్స్ దేవుళ్ల మాదిరి కొలుస్తారు అని చేసిన కామెంట్స్ విజయ్ ఫ్యాన్స్ చూడలేదేమో.. లేక చూసి గుర్తు లేదేమో కాని..ఎడ్వర్డ్‌ సోన్నెన్‌బ్లిక్‌ కామెంట్స్ మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios