Asianet News TeluguAsianet News Telugu

హీరోగా మహేష్ బాబు మరో మేనల్లుడు, కొడుకు ఎంట్రీపై సుధీర్ బాబు క్లారిటీ..


ఘట్టమనేనిఫ్యామిలీ నుంచి మరోవారసుడు బయలుదేరాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరో మేనల్లుడు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి సిద్దం అవుతున్నాడు. 

Mahesh Babu son in law charit Manas Son Of Sudheer Babu tollywood Entry JMS
Author
First Published Jan 10, 2024, 11:38 AM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వారసుల ప్రవాహం ఆగడంలేదు. ఇప్పటికే అత్యధికంగా మెగా ప్యామిలీ నుంచి పదిమంది దాకా హీరోలు ఉండగా.. అక్కినేని ఫ్యామిలీ.. మంచు ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కూడా వారసులు ఇండస్ట్రీలో  కొనసాగుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వారసుల సంఖ్య పెరుగుతుంది. స్టార్ డమ్ పరంగా కాకపోయినా.. సంఖ్య పరంగా  మెగా ఫ్యామిలీకి పోటీ ఇవ్వడానికి ఘట్టమనేనిఫ్యామిలీ సై అంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబుతో పాటు.. కృష్ణ వారసులుగా ఐదుగురు హీరోలు ఉండగా.. త్వరలో మరో వారసుడు ఇండస్ట్రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. 

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వెండితెరపై మరో హీరో రాబోతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంలో ఇప్పటికే నలుగురైదుగురు హీరోలు ఉండగా.. మరో హీరో ఎంట్రీకి సన్నాహాలుజరుగుతున్నాయి. కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తనకంటూ స్టార్ డమ్ సంపాదించుకున్నారు. టాలీవుడ్  లో తిరుగులేని ఇమేజ్ ను సాధించాడు మహేష్. తన నటనతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈసంక్రాంతికి  గుంటూరు కారం  సినిమాతో రిలీజ్ కు రెడీ అవుతున్నారు. 

Mahesh Babu son in law charit Manas Son Of Sudheer Babu tollywood Entry JMS

ఇక కృష్ణ తరువాత మహేష్ బాబు.. ఆయన తరువాత  హీరోగా కృష్ణ అల్లుడు సుధీర్ బాబు  వెండితెర అరంగేట్రం చేసి.. వైవిధ్యమైన కథలు.. పాత్రలను ఎంచుకుంటూ.. మంచి మంచి కాన్సెప్ట్ లను ఆడియన్స్ కు పరిచయం చేస్తున్నాడు సుధీర్ బాబు.  43 ఏళ్ల వయస్సులో కూడా  కుర్ర హీరోలా మెరిసిసోతూ..టోన్డ్ బాడీతో అదరగొడుతున్నాడు. 

ఇక వీరితో పాటు కృష్ణ వారసులుగా గల్ల ఫ్యామిలీ నుంచి గల్లా అశోక్ కుమార్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మహేష్ బాబు మేనల్లుడిగా మొదట  తెలుగు ప్రజలకు దగ్గరయ్యాడు. గల్లా ఫ్యామిలీ నుంచి అశోక్ తమ్ముడు కూడా ఎంట్రీకి రెడీ అవుతున్నాడట. ఇక తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు ముచ్చటగా మూడో మేనల్లుడు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమౌతున్నట్టు తెలుస్తోంది. 

మహేష్ ను చూస్తుంటే మాటలు రావడంలేదు, డైలాగ్స్ కూడా మర్చిపోయా శ్రీలీల కామెంట్స్ వైరల్..

ఇక ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు తనయుడు చరిత్ మానస్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. హీరో సుధీర్ బాబుకు ఇద్దరు కొడుకులు ఉండగా..పెద్ద కొడుకు చరిత్ మానస్. చిన్న కొడుకు పేరు దర్శన్. పెద్దవాడు చరిత్ మానస్ లో  మేనమామ మహేష్ పోలికలు ఎక్కువగా ఉండటం.. క్యూట్ గా కనిపించడం, పైగా అన్నివిద్యల్లో ఇప్పటికే ఆరితేరుతున్నాడట. కొన్నిరోజుల క్రితం చరిత్ మానస్ వీడియో వైరల్ అయ్యింది.  తండ్రి సుధీర్ బాబులా..  జిమ్నాస్టిక్స్, డాన్స్ టాలెంట్స్ తో చరిత్ ట్రైనింగ్ అవుతున్నాడు.  దీంతో చరిత్ తెలుగు సినీ పరిశ్రమలోకి మరో హీరో రాబోతున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. 

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్ ఎవరో తెలియదు.. ఆర్‌ఆర్‌ఆర్‌ నటుడి మాటలకు అర్ధం అదేగా..?

ఇక ఈ విషయంలో సుధీర్ బాబు కూడా స్పందించారు. తన కొడుకు సినీ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు సుధీర్ బాబు. తాజాగా సుధీర్ బాబు తన ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నాడు. ఈ సందర్భంగా చరిత్ లాంచ్ గురించి ప్రశ్నలు రాగా  దానికి ఇంకా  రెండుమూడేళ్లు టైమ్ ఉంది అన్నారు సుధీర్. ప్రస్తుతం అతను ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.. అంటూ చెప్పుకొచ్చారు. మరో వైపు మహేష్ బాబు వారసుడిగా గౌతమ్ కృష్ణ కూడా హీరోగా రంగంలోకి దిగబోతున్నాడు. అయితే దానికి ఇంకా టైమ్ ఉన్నట్టు తెలుస్తోంది. అతను చదవు పూర్తిచేయడంతో పాటు.. హీరోగా తనను తాను మార్చు కోవడానికి  మరో పదేళ్లు టైమ్ పడుతందట. ఈ విషయం  నమ్రత వెల్లడించింది. మహేష్ తరువాత వారసుల్లో ఎవరు ఆ రేంజ్ అందుకుంటారో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios