Asianet News TeluguAsianet News Telugu

‘రొమాంటిక్‌’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్,ఎప్పుడంటే

 ఈ సినిమాకి సంబంధించిన కథ, స్క్రీన్ ప్లే మరియు డైలాగులు పూరిజగన్నాథ్ అందించారు. పూరి జగన్నాథ్ చార్మి కవర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 29న విడుదలైన థియేటర్లలో విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా త్వరలోనే ఓటీటిలో సందడి చేయనుంది. 

Romantic Gets An OTT Premiere Date
Author
Hyderabad, First Published Nov 17, 2021, 8:54 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు తనయుడు ఆకాష్ పూరి "మెహబూబా" అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యాడు. కానీ మొదటి సినిమా మాత్రం అంతగా ఆడకపోయినా ఆకాష్ పూరి కొన్ని నెలల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. తాజాగా ఇన్నాళ్ళకి మళ్ళీ ఆకాష్ హీరోగా "రొమాంటిక్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి కొత్త దర్శకుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సంబంధించిన కథ, స్క్రీన్ ప్లే మరియు డైలాగులు పూరిజగన్నాథ్ అందించారు. పూరి జగన్నాథ్ చార్మి కవర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 29న విడుదలైన థియేటర్లలో విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా త్వరలోనే ఓటీటిలో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ఈనెల 26 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. ఓటీటిలో ఈ సినిమా బాగా ఆడుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ బాగా చేసింది టీమ్. ప్రభాస్ తో చేసిన రొమాంటిక్ డేట్ వీడియో వైరల్ అయ్యింది. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ వచ్చి రచ్చ చేసారు. అలా జనాల్లోకి ఈ సినిమాకు బాగా వెళ్ళిది. అలాగే రొమాంటిక్  చిత్రంలో ‘పీనే కే బాద్‌’ అనే పబ్ సాంగ్ వుంది.  పూరి జగన్నాథ్, భాస్కరభట్ల కలసి రాసిన ఈ పాట లిరిక్స్ క్యాచిగా ఉండటంతో బాగా క్లిక్కైంది. ఈ సాంగ్ స్పెషల్  ఏమిటంటే ..ఈ పాటలో హీరో రామ్ , పూరి కనిపించారు. రామ్ కనిపించడమే కాదు మాస్ స్టెప్పులు కూడా వేసాడు. రామ్ మంచి డ్యాన్సర్. కాబట్టి రామ్ స్టెప్స్ తో  రొమాంటిక్ కి మరో స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు.

చిత్రం స్టోరీ లైన్ ఏమిటంటే...వాస్కో డా గామా (ఆకాష్ పూరి) గోవాలోని స్లమ్ లో  పుట్టి పెరిగుతాడు. అక్కడే డ్రగ్ గ్యాంగ్ తో చేతులు కలుపుతాడు వాస్కో. జీవితం మారిపోయే ఒక పెద్ద డీల్ ని ఒప్పుకొని ఆ పనిలో పడతాడు కానీ కొన్ని అనుకోని సంఘటనల వలన ఒక పోలీస్ ఆఫీసర్ ని చంపేయాలి వస్తుంది. దీంతో మరింత పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కుంటాడు వాస్కో. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం తన వెనక పడుతూ ఉంటుంది. మరోవైపు వాస్కో మౌనిక (కేతీక శర్మ) తో పీకల్లోతు ప్రేమలో మునిగి ఉంటాడు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రమ్యకృష్ణ వాస్కోని పట్టుకోవడానికి రంగంలోకి దిగుతుంది. చివరికి ఏమైంది అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

Also read మ్యూజిక్ డైరెక్టర్ కి పూరి జగన్నాధ్ వార్నింగ్.. ఎన్టీఆర్ కోసమే..
 
ఆకాష్ పూరి మాట్లాడుతూ...‘‘ఇదొక రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. శక్తిమంతమైన పోరాటాలతో పాటు చాలా ఎమోషనల్‌ కంటెంట్‌ ఉంది. నేనిందులో వాస్కోడిగామా అనే పాత్రలో కనిపిస్తాను. ఈ చిత్రంలో ఊహించని మలుపులేమీ ఉండవు కానీ, కచ్చితంగా సినిమా చూస్తే ఎగ్జైట్‌ అవుతారు. చంటిగాడు, పండుగాడు, బుజ్జిగాడు అనే పాత్రలు ఎలా గుర్తుండిపోయాయో.. నా వాస్కోడిగామా పాత్ర అందరికీ అలా గుర్తుండిపోతుంది. రమ్యకృష్ణ గారితో పనిచేయడం అదృష్టంగా ఫీలవుతున్నా’’ అన్నారు.

Also read Samantha:ఐటెం సాంగ్ కోసం అన్ని కోట్లా... సమంతకు షాకింగ్ రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన పుష్ప మేకర్స్!

 ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘రొమాంటిక్‌’ రెండూ ఒకే సమయంలో జరిగాయి. అయితే ‘ఇస్మార్ట్‌..’ పెద్ద హిట్టవ్వడంతో.. దీన్ని ఇంకా బాగా తీయాలని అనుకున్నాం. అప్పుడే రమ్యకృష్ణ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ఆమె రాకతో సినిమా స్థాయి మారిపోయింది’’ అని చెప్పుకొచ్చారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios