Asianet News TeluguAsianet News Telugu

Samantha:ఐటెం సాంగ్ కోసం అన్ని కోట్లా... సమంతకు షాకింగ్ రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన పుష్ప మేకర్స్!

కెరీర్ లో మొదటిసారి ఓ ఐటెం సాంగ్ లో కనిపించనుంది సమంత. సమంత పదేళ్ల కెరీర్ లో ఫస్ట్ టైం స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. స్టార్ హీరోయిన్ గా సూపర్ ఫార్మ్ లో ఉన్న సమంత ఈ ఆఫర్ కి ఒప్పుకోవడం సంచలనమే. అయితే ఆమె రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో ఉన్నట్లు సమాచారం. 


 

shocking remuneration for samantha for pushpa item song
Author
Hyderabad, First Published Nov 17, 2021, 8:26 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అల్లు అర్జున్ (Allu arjun) పాన్ ఇండియా చిత్రం పుష్ప. మేకర్స్ కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా పుష్ప విడుదల కానుంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 17న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండగా... ప్రమోషన్స్ జోరు పెంచారు. వరుసగా మూవీలోని ఒక్కొక్క సాంగ్ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మూడు పాటలు విడుదల కాగా... ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా... అనే నాలుగవ సాంగ్ 19న విడుదల కానుంది. 


కాగా పుష్ప (Pushpa) మూవీలో సమంత ఓ స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు అంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇది నిజమే అంటూ చిత్ర యూనిట్ రెండు రోజుల క్రితం అధికారిక ప్రకటన చేశారు. దీనితో మూవీపై అంచనాలు మరో స్థాయికి చేరాయి. స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత ఐటెం సాంగ్ చేయడం ఒక విశేషం కాగా.. కెరీర్ లో మొదటిసారి అలా కనిపించనున్నారు. ఈ న్యూస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు సమంత ఫ్యాన్స్ కి మంచి కిక్ పంచింది. 


అయితే పుష్పలో ఐటెం సాంగ్ కోసం సమంత(Samantha) తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కూడా ఆమె రేంజ్ లోనే ఉన్నట్లు సమాచారం. ఐదు నిమిషాల నిడివి కలిగిన ఈ మాస్ మసాలా సాంగ్ కోసం సమంత ఏకంగా రూ. 1.5 కోట్లు తీసుకుంటున్నారట. ఇంత భారీ మొత్తం చెల్లిస్తా అంటేనే, సమంత స్పెషల్ సాంగ్ కి ఓకే చెప్పారట. కోటిన్నర అంటే ఓ స్టార్ హీరోయిన్ రెమ్యూనరేషన్ తో సమానం. మరి సమంత ఒక్క పాటకు అంత ఛార్జ్ చేస్తున్నారంటే మాములు విషయం కాదు. 

Also read Samantha:చిక్కులన్నీ వీడినట్లే సూపర్ హ్యాపీగా కనిపిస్తున్న సమంత, క్లోజ్ ఫ్రెండ్ ప్రీతమ్ డిజైన్ చేసిన డ్రెస్ లో

పుష్ప మొదటి పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తి కావడం జరిగింది. ఇక సమంత-అల్లు అర్జున్ పై ఈ సాంగ్ షూట్ చేయాల్సి ఉంది. దాదాపు ఐదు రోజులు ఈ ఐటెం సాంగ్ షూట్ జరగనుందట. కాగా దర్శకుడు సుకుమార్ రంగస్థలం ఫార్ములానే పుష్పకు వాడుతున్నట్లు అనిపిస్తుంది. రష్మిక (Rashmika mandanna)లుక్ రంగస్థలంలో సమంత లుక్ ని తలపిస్తుంది. ఆ సినిమాలో పూజా హెగ్డేతో ఐటెం సాంగ్ చేయించిన సుకుమార్, ఈ సారి సమంతను ఎంచుకున్నాడు. 

Also read Samantha: ఫస్ట్ టైమ్‌ సమంత ఐటెమ్‌ సాంగ్‌.. `పుష్ప` టీమ్‌ అఫీషియల్‌ అనౌన్స్ మెంట్‌

Follow Us:
Download App:
  • android
  • ios