Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్  కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 23వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

ఈరోజు ఎపిసోడ్ లో ధరణి వంట చేసుకుంటూ ఉండగా అప్పుడు మహేంద్ర గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. ఇంతలో జగతి ధరణి వంట విషయంలో సహాయం చేయాలా అని అడగగా వద్దులే చిన్న అత్తయ్య అని అంటుంది. అప్పుడు జగతి అక్కయ్య ఎక్కడికి వెళ్లారు అని అడగగా ఏమొచ్చిన అత్తయ్య నేను వచ్చేసరికి పెద్ద అత్త ఇంట్లో లేరు అనడంతో వెంటనే మహేంద్ర వదిన బయటకు వెళ్ళింది అంటే ఎవరికో మూడింది అని అర్థం అని అంటాడు. ఎందుకు మహేంద్ర అలా మాట్లాడుతావు అని అంటుండగా ఇంతలోనే దేవయాని చెయ్యి పట్టుకొని రావడంతో అది చూసి జగతి వాళ్ళు ఆశ్చర్యపోతారు.

అప్పుడు నేను మీతో తర్వాత మాట్లాడతాను పెద్దమ్మ మీరు ఇంకొకసారి ఇలా చేయకండి అనగా అది కాదు రిషి అనగా పెద్దమ్మ ఇప్పటివరకు మీరు నా బాగోగులు చూసుకున్నారు నేను కాదు అనను కానీ మా విషయంలో మాత్రం మీరేం మాట్లాడకండి ఆ విషయం గురించి నేనే ఆలోచిస్తాను అని అంటాడు. మీరు దయచేసి ఇంకొకసారి వసుధార వాళ్ళ ఇంటికి వెళ్లొద్దండి మళ్ళీ నేను ఇలా మీకు చెప్పే పరిస్థితిని తీసుకురాకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అందరూ నవ్వుకుంటూ ఉండగా అది చూసి దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరొకవైపు వసుధార పాటలు వింటూ పని చేసుకుంటూ రిషి గురించి తనలో తానే మాట్లాడుతూ ఉంటుంది.

అప్పుడు చక్రపాణి బయటకు వెళ్ళొస్తాను అని వెళ్లిపోగా ఇంతలో అక్కడికి రిషి వచ్చి వసుధార వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు రిషి అక్కడ బుక్స్ సర్దుతూ ఉండగా ఇంతలో వసుధార నాన్న ఒకసారి ఇక్కడికి రండి అనడంతో రిషి అక్కడికి వెళ్తాడు. అప్పుడు వసుధార వెనక్కి తిరిగి చూడగా అక్కడ రిషి ఉండడంతో అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూసి అక్కడ నుంచి వెళ్లిపోవడంతో ఏంటి పొద్దున్నే రిసీ సార్ వచ్చినట్టు బ్రమ పడ్డానా అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే చక్రపాణి అక్కడికి వచ్చి రిషి సార్ అనడంతో అప్పుడు రిషిని ఆశ్చర్య పోతుంది వసుధార.

రిషి సార్ ఎప్పుడు వచ్చారు ఇప్పుడే వచ్చారా లేక అప్పుడే వచ్చారా లేక ఇదంతా నా భ్రమనా అనుకుంటూ ఉంటుంది వసుధార. అప్పుడు వసుధర అక్కడికి వెళ్లి గుడ్ మార్నింగ్ సార్ నందు రిషి మౌనంగా ఉంటాడు. అప్పుడు చక్రపాణి కాఫీ తీసుకొని రావడానికి వెళ్లడంతో సర్ ఇందాక మీరు కిచెన్ లోకి వచ్చారా అనగా కిచెన్ లోకి నాకేం పని అదేమైనా నాకు హాబీ నా అని అంటాడు రిషి. ఇంకా నా మీద కోపం తగ్గలేదు సార్ అనగా నువ్వు పెన్ను పేపర్ తీసుకోలేదు నా మనసు లాగేసుకున్నావు అని అంటాడు రిషి. అన్ని వివరాలు చెప్పాను కదా సార్ అనగానే వివరాలు నాకు అక్కర్లేదు అంటాడు రిషి.

పొద్దున్నే వచ్చారు సార్ ఏంటి అనడంతో ఓపెన్ డ్రైవ్ చూపించి ఇందులో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ డీటైయిల్స్ ఉన్నాయి. ఇవి నువ్వు ప్రజెంట్ చేయొచ్చు అని చెబుతాడు. అప్పుడు మనసులో ఎన్నాళ్ళని ఇలా కోపాన్ని భరిస్తారు సార్ నా వల్ల పొరపాటు జరిగింది అని ఎంతో పొరపాటు కాదు వసుధార తప్పు జరిగింది అని అంటాడు. మరోసారి అడుగుతున్నాను నీ మెడలో ఉన్న తాళిని తీసేస్తావా తీయలేవు కదా మరి తర్వాత పరిస్థితులు ఏంటి అనిపిస్తుంది. చక్రపాణి అక్కడికి కాఫీ తీసుకొని రాగా నాన్న రిషి సార్ ఉప్మా తింటాడు అనగా లేదు కాఫీ అంటూ వాళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉండగా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. మరొకవైపు జగతి మహేంద్ర ఇద్దరూ కొబ్బరి బోండాలు తాగుతూ ఉంటారు.

అప్పుడు వారిద్దరు రిషి, వసు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మహేంద్ర వసుధార, రిషి లకు పెళ్లి చేసేద్దాము అనడంతో జగతి చేతులు జోడించి నీకు దండం పెడతాను రిషి పెళ్లి విషయంలో కలుగచేసుకోకు. సమయం సందర్భం వచ్చినప్పడు చూద్దాం అంటుంది జగతి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఒకవైపు వసుధార కాలేజీ స్టూడెంట్స్ తో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి రిషి వచ్చి వసుధార మాటలు వింటూ ఉంటాడు. అప్పుడు వసుధార బోర్డు మీద రాస్తుండగా రిషి సైలెంట్ గా వెళ్లి ఏమీ తెలియనట్టుగా ఒక బెంచ్ లో కూర్చుని వసుధార చెప్పే మాటలు వింటూ ఉంటాడు.

అప్పుడు వసుధార రిషి ని పట్టించుకోకుండా మిషన్ ఎడ్యుకేషన్ గురించి వివరిస్తూ ఉంటుంది. అప్పుడు రిషి,వసుధార టీచర్ అవుతుంది అనుకుంటూ ఉండగా అప్పుడు వసుధార రిషి ని చూసి ఇదంతా నా భ్రమ అయి ఉంటుంది అనుకుంటూ మిషన్ ఎడ్యుకేషన్ గురించి వివరిస్తూ ఉంటుంది. ఇప్పుడు వసుధారా నిజంగానే రిషి సార్ వచ్చారు అనుకోని ఎక్కడికి వెళ్లగా మీరు ఎప్పుడు వచ్చారు సార్ అని అనడంతో నా ఉంగరం నాకు ఇచ్చేయ్ అనడంతో అలా ఎలా ఇస్తారు సార్ నేను ఇవ్వను అని అంటుంది. ఎందుకు ఇవ్వవు అనగా అందులో నా పేరు కూడా ఉంది సార్ అని అంటుంది.

అందులో వి అక్షరం నాకు ఇచ్చి ఆర్ తీసుకోండి అనడంతో అలా ఎలా సాధ్యమవుతుంది అనగా మన పేర్లు కాదు సార్ కలిసిపోయింది మన ఆత్మలు మన బంధం కలిసి పోయింది అని అంటుంది వసుధార. అప్పుడు వసు మెడలో తాళి బయటకు చూపిస్తూ ఈ రెండు అక్షరాలు ఎప్పటికీ ఇలాగే కలిసిపోవాలి మనం కూడా కలిసే ఉండాలి అని అంటుంది. అప్పుడు రిషి బంధం అంటే బాధ పెట్టడం అని ఎక్కడైనా ఉందా వసుధార అంటూ బాధగా మాట్లాడి నువ్వే ఆలోచించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వసు తనలో తానే మాట్లాడుకుంటూ అప్పుడు ఏదో జరిగిపోయింది సార్. కానీ ఇప్పుడు కూడా అలాగే ఉండాలంటే ఎలా అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది.