Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్  కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 14వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

ఈరోజు ఎపిసోడ్ లో వసుధారకు రిషి తలనొప్పి తగ్గిందా అని మెసేజ్ చేయగా మీరు వెళ్లిపోయారు గా అని మెసేజ్ చేస్తుంది వసుధార. అప్పుడు రిషి అంటే నేను తలనొప్పిగా మారానా అని అనుకుంటూ ఉంటాడు. నేను వసుధారని ఎక్కువగా విసిగించానా, కోపగించుకున్నాన అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఇద్దరూ ఒకేసారి ఫోన్ చేయగా ఇద్దరికీ ఒకేసారి బిజీ రావడంతో ఎవరితో మాట్లాడుతున్నారో అని ఇద్దరు అనుకుంటారు. వసుధార వెంటనే ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత రిషి, వసుధార జ్ఞాపకాలు తెలుసుకుని బాధపడుతూ ఉంటాడు. మరోవైపు వసుధార కూడా రిషి గురించి తలచుకొని బాధపడుతూ ఉంటుంది.

తర్వాత రిషి కాలేజీలో వర్క్ చేసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి పుష్ప రావడంతో పుష్ప ని పలకరిస్తూ ఉంటాడు రిషి. అప్పుడు రిషి వసుధార గురించి వసుధార హస్బెండ్ గురించి అడగగా మాకు ఏమీ తెలియదు సార్ అందుకే ఒక ప్లాన్ వేసాము ఈ సండే అందరూ కలిసి వసుధార వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అనడంతో మంచి ఐడియా అని అంటాడు రిషి. అప్పుడు రిషి మీరు వసుధర ఇంటికి వెళ్లే బదులు వసుధార తన హస్బెండ్ ని మీ ఇంటికి రమ్మని చెప్పు అనడంతో పిలిచాను సార్ ఇప్పుడే రాము అని చెప్పింది అని అంటుంది పుష్ప. మరి ఈ విషయం గురించి ఏదైనా ఆలోచించు పుష్ప అని అంటాడు రిషి. పెళ్లి ఫోటోలు వీడియోలు ఏమైనా అడిగావా అనడంతో ఏది అడిగినా సమాధానం చెప్పడం లేదు సార్ అనడంతో తెలివైనది అని అనుకుంటూ ఉంటాడు రిషి.

తర్వాత పుష్ప అక్కడి నుంచి వెళ్తుండగా చక్రపాణి నెంబర్ ఇప్పించుకుంటాడు రిషి. ఆ తర్వాత రిషి చక్రపాణి కి ఫోన్ చేస్తాడు. అప్పుడు వసుధార గొంతు మార్చి మాట్లాడడంతో వెంటనే రిషి ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు వసు కాల్ చేయగా రిషి కట్ చేస్తాడు. అప్పుడు వసుధర ఫోన్ చేసి ఎవరండీ కాల్ చేశారు అంటూ ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వసుధార పదేపదే ఎండి అని అనగా రిషి ఆశ్చర్యపోతాడు. అప్పుడు వసు రిషిని ఆట పట్టిస్తూ మాట్లాడుతుంది. ఎండి గారు వివరాల కోసం బాగానే ప్రయత్నిస్తున్నారు అనుకుంటూ ఉంటుంది. తర్వాత వసుధార కాలేజీకి వస్తూ రిషి సార్ నిజం తెలుసుకోవడానికి బాగానే ప్రయత్నిస్తున్నారు అనుకుంటూ ఉంటుంది.

అప్పుడు రిషి నడుచుకుంటూ వెళ్తుండగా వసుధార పిలిచినా పట్టించుకోకుండా ఏదో పరద్యానంతో అక్కడి నుంచి వెళ్లి ఒక చోటు కూర్చుంటాడు. వెళ్లి రిషి సార్ ని పలకరిద్దాం కోప్పడితే కోప్పడని నా రిషి సారే కదా అనుకుంటూ అక్కడికి వెళుతుంది వసుధార. అప్పుడు వసుధార రిషి దగ్గరికి వెళ్లి రిషి లాగ కూర్చొని రిషి ని ఇమిటేట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు రిషి నువ్వెప్పుడొచ్చావు అనడంతో నేనెప్పుడూ మీ వెనకే ఉంటాను సార్ అని అంటుంది. నువ్వు నా వెనకాల కాదు,నా పక్కన ఉండాల్సింది అనుకుంటూ ఉంటాడు రిషి. అప్పుడు ఎక్కువగా ఆలోచించకండి సార్ అని అనడంతో మళ్ళీ అలాంటప్పుడు ఎందుకు కొన్ని విషయాలు దాచావు అని అంటాడు.

అప్పుడు వారిద్దరూ గతంలో జరిగిన విషయాలు తలచుకొని బాధపడుతూ ఉంటారు. అప్పుడు వెళ్దాం పదండి సార్ నేను తో నేను రాను నువ్వు వెళ్ళు అని అంటాడు. అప్పుడు 7 అంకెలు లెక్క పెట్టెలోగ రావాలి అనడంతో అప్పుడు రిషి ఏడు అంకెలు లెక్కపెట్టిలోగా లేచి వసుధారతో కలిసి వెళ్తాడు. మరోవైపు మహేంద్ర, రిషి,వసువిషయంలో లేట్ చేయొద్దు జగతి ఇప్పటికే రెండు రోజుల్లో ఒకరోజు గడిచిపోయింది ఇంకొక రోజు మాత్రమే సమయం ఉంది అంటాడు. ఎందుకు మహేంద్ర అంతగా ఆవేశపడుతున్నావు కొంచెం ఆలోచించు అని అంటుంది జగతి. ఇంతలోనే అక్కడికి రిషి రావడంతో జగతి కొత్త ప్లాన్ మొదలు పెడుతుంది.