Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్  కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 15వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

ఈరోజు ఎపిసోడ్ లో రిషి అక్కడికి రావడంతో జగతి కొత్త నాటకం మొదలు పెడుతుంది. అప్పుడు మహేంద్ర ఏం మాట్లాడాలో అర్థం కాక అయోమయంలో ఉంటాడు. అప్పుడు రిషి ఎక్కడికి వెళ్లనంటున్నారు డాడ్ అనగా మహేంద్ర ఏం మాట్లాడాలో తెలియక ఉంటాడు. అప్పుడు మహేంద్ర నేను రాను అంటాడు. ఇప్పుడు మహేంద్ర జగతి వాదించుకుంటూ ఉండగా ఇంతలో రిషి మేడం మిమ్మల్ని నేను తీసుకెళ్తాను అనడంతో జగతి సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు రిషి, జగతి అక్కడి నుంచి వెళ్తుండగా ఎక్కడికి అని మహేంద్ర అనడంతో తర్వాత వచ్చి చెప్తాను అంటుంది జగతి.

అప్పుడు ఎక్కడికి వెళ్లాలి మేడం అని రిషి అడగగా కారు పోనివ్వు అని అంటుంది జగతి. ఆ తర్వాత జగతి కార్ లో వెళ్తూ ఉండగా అప్పుడు రిషి వసుధార ఎవరిని పెళ్లి చేసుకుంటే మేడంని అడిగితే బాగుంటుందా అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఏంటో మేడం కొందరు దగ్గర వాళ్లకు కూడా చెప్పాల్సిన నిజాలు అన్ని దాస్తూ ఉంటారు అనగా ఎవరి గురించి మాట్లాడుతున్నావ్ రిషి అనడంతో వసుధార గురించి అని అంటాడు. అప్పుడు జగతి కొందరు అన్ని విషయాలు చెబితే మరికొందరు మనసులోనే దాచుకుంటారు అని అంటుంది. అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తరువాత జగతి,రిషి ఇద్దరు కలిసి వసుధార వాళ్ళ ఇంటికి వెళ్తారు. అప్పుడు జగతి రిషిని లోపలికి రమ్మని పిలిచినా కూడా బయటే ఆగిపోతాడు.

అప్పుడు జగతి లోపలికి వెళ్లడంతో ఏంటి మేడం మీరు వచ్చారు అనగా కొన్ని కొన్ని సార్లు రాక తప్పదు వసుధార అని అంటుంది. రిషి సార్ వచ్చాడా అనడంతో అవును అనగా అప్పుడు వసు రిషి దగ్గరికి వెళుతుంది. తరువాత చక్రపాణి జగతికి కాఫీ తీసుకొని వస్తాడు. ఆ తర్వాత వసుధార కార్ దగ్గరికి వెళ్లి డోర్ కొట్టిన రిషి తీయకుండా అలాగే ఉంటాడు. ఏంటి సార్ ఎంత పిలిచినా డోర్ తీయడం లేదు అనడంతో సారీ నాకు వినిపించలేదు అని అంటాడు. అప్పుడు వారిద్దరూ సరదాగా వాదించుకుంటారు. అప్పుడు లోపలికి రండి అనగానేమి రాను అనడంతో సరే సార్ నేను వెళ్తున్నాను మీరు మనసు మార్చుకుని రావాలి అనుకుంటే లోపలికి రండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార.

 అప్పుడు బయట మగవారి చొప్పులు ఉండటం చూసి వసుధార భర్తవే అనుకుని రిషి లోపలికి స్పీడ్ గా వెళ్తాడు. లోపలికి చూస్తూ ఉంటాడు. అప్పుడు వసుధార మీకు కావాల్సిన వాళ్ళు లోపల ఉన్నారు సార్ అనడంతో వసుధార బెడ్ రూమ్ లోకి వెళ్తాడు రిషి. అప్పుడు రిషి అక్కడ ఎవరు లేకపోవడంతో తన ముఖం తానే అద్దంలో చూసుకొని వసుధార ఏమనుకుంటుంది పిచ్చోన్ని చేస్తుందా అనుకొని తో బయటికి వెళ్తాడు. అప్పుడు చక్రపాణి ఎంత పిలిచినా కూడా వినిపించుకోకుండా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏంటి మేడం సార్ అలా కోపంగా వెళ్ళిపోయారు సార్ది కావాల్సిన వాళ్ళు లోపల ఉన్నారని చెప్పాను అంతమాత్రానికే వెళ్లిపోవాలా అనడంతో నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు వసు అంటుంది జగతి.

 డైరెక్ట్ గా రిషితో చెప్తావా లేదా అని అడుగుతుంది జగతి. రిషి సార్ తెలుసుకుంటారు అనుకుంటున్నాను మేడం అని అంటుంది. నేనే రిషి సార్ కీ నిజం తెలిసేలా చేస్తాను అని అంటుంది. అప్పుడు జగతి కోసం రిషి క్యాబ్ బుక్ చేయడంతో జగతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు కాలేజీకి వెళ్లిన రిషి వసుధార చేసిన పనిని తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నన్ను ఎందుకు పిచ్చోన్ని చేస్తుంది వేలాకోలం చేస్తుందా డైరెక్ట్ గా నోటితో చెప్తే సరిపోతుంది కదా అనుకుంటూ ఉంటాడు. అప్పుడు రిషి ఇలా అయితే కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు జగతి ఒకచోట కూర్చుని ఉండగా ఇంతలోనే అక్కడికి మహేంద్ర వస్తాడు. అప్పుడు జగతి, మహేంద్ర వసుధార కోసం వెళ్లగా వసుధార లైబ్రరీలో ఉంది అని తెలుసుకొని అక్కడికి వెళ్తారు. మరో వైపు వసు రిషి ఇద్దరు రూమ్ కి వెళ్లి బుక్స్ వెతుకుతూ ఉంటారు. అప్పుడు వసుధార మెడలో ఉన్న తాళిబొట్టు ఆ తాళికి ఉన్న రింగు బయట కనిపిస్తుంది.