Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 27వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో వసుధార మిషన్ ఎడ్యుకేషన్ ప్లానింగ్స్,డెవలప్మెంట్స్ ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెప్పమని చెప్పారు అని అంటుంది. మీకు ఒంట్లో బాగోలేదని ప్రెస్ మీట్ తర్వాత పెడతానని చెప్పాను అనగా అప్పుడు రిషి నా హెల్త్ కి, ప్రెస్ మీట్ కి సంబంధం ఏంటి వసుధార నావల్ల ప్రెస్ మీట్ కాన్సిల్ చేస్తే మినిస్టర్ గారు బాధపడతారు కదా అని అంటాడు. అది సార్ మీకు లేకుండా ప్రెస్ మీట్ ఎలా అనడంతో నేను లేకుండానే ప్రెస్ మీట్ అరేంజ్ చేయండి అని అంటాడు రిషి. మన వ్యక్తిగత విషయాలకు ప్రొఫెషనల్ విషయాలకు ఎప్పుడూ ముడి పెట్టొద్దు అని అంటాడు. నువ్వు ఒక్కదానివే చూసుకో అనడంతో నేను ఒక్కదాన్నే చూసుకోలేను సార్ అందరూ కలిసి డిస్కస్ చేయాలి అంటుంది వసుధార.
అప్పుడు జగతి అవును రిషి ప్రెస్ మీట్ గురించి మీరిద్దరే మాట్లాడుకుంటే మంచిది అనడంతో ఇంతలో దేవయాని అక్కడికి వచ్చి అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా అని అంటుంది. రిషికి అసలే ఒంట్లో బాగోలేదు అలాంటిది మీరందరూ కూర్చొని ప్రెస్ మీట్ అని మాట్లాడుతున్నారు అని అంటుంది దేవయాని. తనని ప్రశాంతంగా ఉండనివ్వరా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటూ కాస్త ఓవరాక్షన్ చేస్తుంది దేవయాని. వదిన గారు కాలేజీలో ప్రెస్ మీట్ ఉంది అనడంతో మహేంద్ర ప్రెస్ మీట్ ఉంటే రిషికి అసలు రెస్ట్ ఇవ్వరా అని అంటుంది. అన్నీ రిషి చేస్తే మీరేం చేస్తారు అనగా అప్పుడు రిషి పెద్దమ్మ ప్రెస్ మీట్ మినిస్టర్ గారు ఏర్పాటు చేయమని చెప్పారంటా ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే బాగుండదు అని అంటాడు.
అప్పుడు జగతి మనం ఇక్కడి నుంచి వెళ్ళాం పదా మహేంద్ర వాళ్ళిద్దరూ మిషన్ ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేస్తారు అనడంతో నేను వద్దంటుంటే మళ్ళీ నువ్వు అదే మాట మాట్లాడతావు కదా జగతి అని అంటుంది దేవయాని. పెద్దమ్మ ప్లీజ్ అనడంతో జగతి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు దేవయాని కూడా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వసుధార రిషి ఇద్దరు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడాలి అన్నవి రిషి చెబుతూ ఉండగా వసుధార వాటిని నోట్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి మాటలకు వసుధార కూడా చాలా బాగా చెబుతున్నారు సార్ అంటూ ఆ పాయింట్స్ రాస్తూ ఉంటుంది.
అప్పుడు రిషి వసుధార మెడలో తాళి వైపు చూస్తుండగా వసుధార కొన్ని విషయాలు గోపిక లేకపోవడమే మంచి సార్ నాకు ఆ విషయం చాలా లేటుగా తెలిసి వచ్చింది అని అంటుంది. ఈ బంధానికి బంధనాలు పడితే వాటిని మీరే తొలగించాలి సార్ అని అంటుంది. జరిగిన విషయాన్ని మీరే ప్రపంచానికి తెలియజేయాలి సార్ అని అంటుంది. సరే సార్ నేను వెళ్లి వస్తాను మీరు టైం టు టైం టాబ్లెట్స్ వేసుకోండి,తినండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు వసుధార కాలేజీలో రిషి తో గడిపిన క్షణాలు గుర్తుతెచ్చుకొని సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు కాలేజీలో రిషి కారు చూసి ఎక్కడికి కోపంగా వెళుతుంది వసుధార. ఏంటి సార్ మీరు జ్వరం వచ్చినప్పుడు ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి కదా కాలేజీకి ఎందుకు వచ్చారు ముందు లేవండి ఇంటికి వెళ్లిపోండి అని అంటుంది.
అప్పుడు రిషి మాట్లాడడానికి ప్రయత్నించగా వసుధార రిషిను మాట్లాడించకుండా నేను చూసుకుంటాను కదా సార్ మీరు ఎందుకు వచ్చారు అని కోపంగా మాట్లాడుతుంది. హలో ఏంటి నువ్వు దబాయిస్తున్నావు అనగా సార్ నేను దబాయిస్తాను. మీరు వెళ్తారా లేదా కార్ డ్రైవర్ ని పంపించమంటారా అనగా ఏమి అవసరం లేదులే అంటాడు రిషి. సరే సార్ ప్రెస్ మీట్ అయ్యాక వెళ్తారా అనగా సరే చూద్దాం అని అంటాడు. సరే సార్ నాకు వర్క్స్ ఉన్నాయి మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది వసుధార. ఆ తర్వాత అటెండర్ కి చెప్పి రిషి కి సంబంధించిన టాబ్లెట్స్ తీసుకొని రమ్మని చెబుతుంది వసుధార. ఆ తర్వాత రిషి స్టూడెంట్స్ సంబంధించి ఒక ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి వస్తుంది.
ఆ తరువాత టాబ్లెట్స్ ఇస్తూ ఉండగా ఇంతలో కాలేజీ ఫ్యాకల్టీ అక్కడికి వచ్చి వసుధార వాళ్ల వైపు చూసి ఏంటి వీళ్ళ బంధం అసలు అర్థం కావడం లేదు. సార్ కి ఈమె టాబ్లెట్స్ నోట్లోకి వేసి నీళ్లు తాగించేలా ఉంది అనుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి నాకు పని ఉందని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు కాలేజీ ఫ్యాకల్టీ చూసారా మేడం మన ముందు మేడమ్ మేడమ్ అంటూ తిరిగిన వసుధార ఇప్పుడు రిషి సార్ ని బుట్టలో వేసుకోవాలని చూస్తోంది అని రిషి వాళ్ల గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి వాళ్ల గురించి వాళ్లు మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. మీరు ఒకసారి నా క్యాబిన్ కి వచ్చి కలవండి అనడంతో వాళ్ళిద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు. మరొకవైపు జగతి మహేంద్ర సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు.
ఇంతలోనే అటెండర్ అక్కడికి వచ్చి మిమ్మల్ని రిషి సార్ పిలుస్తున్నారు అనడంతో సరే అని అంటుంది జగతి. ఆ తర్వాత జగతి అక్కడి నుంచి వెళ్తుండగా వసుధార ఎదురుపడటంతో థాంక్స్ వసుధార చాలా రోజుల తర్వాత రిషి ముఖంలో ప్రశాంతత చూసాను అని అనడంతో సంతోషపడుతూ ఉంటుంది. నేను కూడా రావాలా మేడం అనడంతో నిన్ను రమ్మని చెప్పలేదు కదా మీ ఎండి గారు అనగా వసుధార సంతోష పడుతూ ఉంటుంది. మరోవైపు కాలేజీ ఫ్యాకల్టీ రిషి ఏమంటాడో అని భయపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి జగతి వస్తుంది. రెండు ఫైల్స్ ఇచ్చి వీళ్లిద్దరూ ఇంతవరకు కాలేజీలో చేసిన తప్పులు ఇవి వీళ్ళు చేసిన మిస్టేక్స్ ఇవే అనడంతో జగతి షాక్ అవుతుంది. వీళ్ళ మాటలు ఏంటో నాకు అర్థం కావడం లేదు వీళ్ళ మాటలు స్వయంగా నేను విన్నాను అనగా అప్పుడు జగతి కాలేజీ ఫ్యాకల్టీ వైపు చూస్తూ ఉండగా వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు.
అవసరం లేని వాటి గురించి డిస్కస్ చేశారు పర్సనల్ విషయాల్లోకి వెళ్లారు అనగా జగతి వాళ్ళ వైపు సీరియస్ గా చూస్తూ ఉంటుంది. వసుధారతో పాటు నన్ను కూడా కలిపి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అనడంతో జగతి కోపంగా చూస్తూ ఉంటుంది. సార్ అది అనడంతో మిమ్మల్ని నేను తప్పు పట్టడం లేదు మీ పద్ధతులు మీకు ఉన్నప్పుడు కాలేజీ పద్ధతిలో కొన్ని ఉంటాయి కదా అని రిషి కోపంగా మాట్లాడుతాడు. అది కాదు సార్ వసుధార అనగా చూడండి మేడం ఇంతకుముందే వసుధార గురించి రెండు సార్లు తప్పుగా మాట్లాడినప్పుడే మీకు సర్ది చెప్పాను కానీ పదే పదే మీరు అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు అని అంటాడు రిషి. మీరు మారతారని సహనంగా ఇన్ని రోజులు వెయిట్ చేశాను మీరు మారరు అని నాకు అర్థమైంది. మిమ్మల్ని ఇద్దరినీ డిస్మిస్ చేస్తున్నాను అనడంతో వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. వీరిద్దరిని డిస్మిస్ చేశాను మేడం ఇమీడియట్ గా ఈ సర్కులర్ అన్ని నోటీస్ బోర్డులో పెట్టించండి అని జగతికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
