Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్  కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 13వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

ఈరోజు ఎపిసోడ్లో దేవయాని జగతి,మహేంద్ర అన్న మాట తలుచుకుని నాకే వార్నింగ్ ఇస్తారా ఇప్పుడు ఏం చేస్తానో చూడండి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రిషి గదిలోకి వెళ్తుంది. అప్పుడు నిన్న ఎక్కడికో వెళ్ళావంట కదా అని రిషిని అడుగుతుంది దేవయాని. నేను వసుధార కలసి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు టూర్ కి వెళ్ళాము అనడంతో ఎవరినో పెళ్లి చేసుకున్న వసుధారతో వెళ్లడమేంటి అనగా కాలేజీకి పర్సనల్ లైఫ్ కి సంబంధం లేదు అంటాడు రిషి. అప్పుడు దేవయాని పెళ్లి చేసుకుని అట్నుంచి అటే వెళ్ళిపోవచ్చు కదా మళ్లీ కాలేజీకి వచ్చి ఎందుకు నేను ఇబ్బంది పెడుతోంది అని అంటుంది. అప్పుడు రిషి ముందు దేవయాని దొంగ ప్రేమను నటిస్తూ నీ కళ్ళ ముందు తిరిగితే నీకు కూడా బాధే కదా రిషి అని మాట్లాడుతుంది.

ఈ పెద్దమ్మని నమ్ము.. నీ గురించి పెద్దమ్మ తప్ప ఎవరు ఆలోచించరు ఆ వసుధారని మరిచిపో కాలేజీ నుంచి తీసేయ్ అని అంటుంది దేవయాని. అప్పుడు రిషి పెద్దమ్మ ఈ విషయాలు గురించి మీకు అనవసరం అని అంటాడు. మీరు మీ ఆరోగ్యం మీద మాత్రమే శ్రద్ద పెట్టండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహేంద్ర,జగతి బాధపడుతూ ఈ వసుధార నిజం చెప్పదు రిషి తెలుసుకునే ప్రయత్నం చేసిన ఇంకా తెలుసుకోలేకపోతున్నాడు అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే రిషి అక్కడికి వస్తాడు. అప్పుడు మేడం మీరు నా దగ్గర ఏమైనా నిజం దాస్తున్నారా అనడంతో మహేంద్ర, జగతి ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు.

 నేను ఏం నిజం దాచాను రిషి అని అనడంతో వసుధార పెళ్లి చేసుకుని వచ్చిన కొత్తలో దూరం పెట్టారు కోప్పడ్డారు. కానీ ఇప్పుడు అలా ప్రవర్తించడం లేదు మీలో ఏదో మార్పు వచ్చింది అనడంతో జగతి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు మహేంద్ర ఇదే మంచి అవకాశం రిషికీ నిజం చెప్పేయ్ అనడంతో సైలెంట్ గా ఉండు అని అంటుంది జగతి. మేడం మీరు ఏమీ తెలియనట్టుగా అన్ని మర్చిపోయి మామూలుగా ఉంటున్నారు. మీకు వసుధార విషయంలో ఏదైనా నిజం తెలిస్తే చెప్పండి మేడం అని చెప్పి రిషి ఎక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఏంటి జగతి నువ్వు రిషికి నిజం చెప్పాల్సింది కదా అనగా ఎలా చెప్తా మహేంద్ర అంటుంది జగతి.

రిషినే నిజం తెలుసుకొనే ప్రయత్నం చేయనిద్దాం మహేంద్ర అని అంటుంది. ఎన్నాళ్లన్నీ నా కొడుకు బాధను చూస్తూ ఉండాలి. నేను వెళ్లి నిజం చెప్పేస్తాను అని మహేంద్ర వెళ్తుండగా అలా ఆలోచించకు అని అంటుంది జగతి. రెండు రోజుల్లో రిషి నిజం తెలుసుకోకపోతే నేనే చెప్పేస్తాను అని అంటాడు మహేంద్ర. మరొకవైపు వసుధార జరిగిన విషయాలు తలచుకొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి చక్రపాణి వస్తాడు. అమ్మ వసు అలసిపోయినట్టున్నావు కాస్త రెస్ట్ తీసుకో అని అనగా శరీరానికి విశ్రాంతిని నాన్న మనసుకు కాదు కదా అని అంటుంది.

ఆ తర్వాత రిషి వచ్చి కారు హారన్ కొట్టడంతో కావాలనే వసుధార లాప్టాప్ వరకు చేస్తున్నట్టు కూర్చుంటుంది. అప్పుడు రిషి ఏంటి వసుధార కార్ హారన్ సౌండ్ వినిపించినా బయటికి రాలేదు అనుకుంటూ ఉంటాడు. నేను వెళ్ళను రిషి సార్ రావాలి అనుకుంటూ ఉంటుంది వసుధార. ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. అప్పుడు రిషిని చూసి నాన్న నాకోసం ఎవరైనా వస్తే లేదని చెప్పండి కాల్ చేస్తే పడుకున్నాను అని చెప్పండి అని అంటుంది. అప్పుడు మహేంద్ర రండి సార్ రిషి సార్ అని అంటాడు. అప్పుడు రిషి లోపలికి వెళ్లినా కూడా వసుధార మాట్లాడకుండా ఉంటుంది.

అప్పుడు నాన్న ఇప్పుడే వస్తాను కాఫీ తీసుకొని వస్తాను అని వసుధర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు వసుధర కాఫీ తీసుకొని రావడంతో రిషి డైరెక్ట్ గా చక్రపాణి గారు నాకేం తలనొప్పి లేదు నేను కాఫీ తాగను అని అంటాడు. అప్పుడు వసుధార ఇచ్చిన కాఫీ ని తీసుకుంటాడు. అప్పుడు వసు, రిషి ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటారు. అప్పుడు వారిద్దరి మౌనాన్ని చూసి చక్రపాణి టెన్షన్ పడుతూ ఉంటాడు. నాన్న నేను కాలేజీకి వెళ్లను అనడంతో చక్రపాణి గారు చెప్పకుండా కాలేజీ మానేయడం కాదు కదా అంటాడు రిషి. అప్పుడు వసుధార పదేపదే ఎండి అని అంటూ ఉంటుంది. అప్పుడు వసుధార రిషి ముందే టైప్ చేసి రిషికి లీవ్ లీటర్ పంపిస్తుంది.

ఆ తర్వాత రిషి ఏం మాట్లాడకుండా కాఫీ తాగకుండా నుంచి వెళ్ళిపోయి ఒక చోట నిలబడి నన్ను తల నొప్పి కావాలనే నేను వచ్చాను అని తలనొప్పి వచ్చినట్టు యాక్ట్ చేస్తుంది అనుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు రిషి. నిజం తెలుసుకోమంటుంది నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తే అడ్డుపడుతుంది ఎవరో ఆ అదృష్టవంతుడు అనుకుంటూ ఉంటాడు రిషి. అప్పుడు రిషి లీవ్ ని రిజెక్ట్ చేస్తున్నాను అని మెసేజ్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిషి వసుధారకి ఏం చేస్తున్నావ్ అని మెసేజ్ పంపిస్తాడు. అప్పుడు వసుధార సిస్టం ముందు కూర్చున్నాను అని చెప్పి ఫోటో పంపిస్తుంది. తలనొప్పి తగ్గిందా అనడంతో మీరు వెళ్లిపోయారు కదా అని మెసేజ్ చేస్తుంది వసుధార.