డర్టీ పిక్చర్ ను మించేలా షకీలా బయోపిక్. ఒకే చేసిన హాట్ హీరోయిన్

First Published 7, Mar 2018, 2:32 PM IST
richa chadha playing lead role film based on Adult star shakeela
Highlights
  • సౌత్ ఇండియాని మొత్తం ఒక ఊపు ఊపిన శృంగార తార షకీలా
  • ఆమె జీవితంపై కూడా బయోపిక్ కు వస్తుంది
  • శృంగార తారగా షకిలా క్రేజ్ స్టార్ హీరోలను మించింది

                                                                 Image result for richa chadda

సౌత్ ఇండియాని మొత్తం ఒక ఊపు ఊపిన శృంగార తార షకీలా జీవితంపై కూడా బయోపిక్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. 90లో తెలుగు, తమిళం, మలయాళం భాషలో షకీలా పలు అడల్ట్ చిత్రాలలో నటించింది. శృంగార తారగా షకిలా క్రేజ్ స్టార్ హీరోలను మించింది. షకీలా జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. షకీలా పాత్రలో నటించడానికి బాలీవుడ్ హాట్ భామ రిచా చద్దా సై అన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

 16 ఏళ్ల నుంచే సినీరంగ ప్రవేశం చేసిన షకీలా శృంగార తారగా ఎదిగిన వైనాన్ని సినిమాగా చూపించబోతున్నారు.ఈ చిత్రంలో షకీలా పాత్రలో నటించడానికి రిచా చద్దా సై అనేసింది. హాట్ హాట్ ఫోటో షూట్ లతో కుర్ర కారుని హీటెక్కించడం ఈ అమ్మడికి అలవాటే. పలు కమర్షియల్ చిత్రాలలో సైతం షకీలా నటించింది. సిల్క్ స్మిత జీవిత గాధగా వచ్చిన డర్టీ పిక్చర్ ఎంతటి ఘనవిజయం సాదించిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రంలో విద్యాబాలన్ బోల్డ్ పెర్ఫామెన్స్ కు ప్రశంసలతో పాటు రివార్డులు కూడా దక్కాయి. ఈ చిత్రానికి ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వం వహించనున్నాడు.ఏప్రిల్ లో చిత్రీకరణ ప్రారంభించి వచ్చే ఏడాది చిత్రాన్ని విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.

loader