Asianet News TeluguAsianet News Telugu

రియా చక్రవర్తికి ఈడీ షాక్‌.. విచారణకు హాజరు కావాల్సిందే

సుశాంత్‌ కేసులో మనీలాండరింగ్‌ జరిగిందన్న కోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. దాదాపు రూ.15కోట్లు సుశాంత్‌ అకౌంట్ల నుంచి రియా కొట్టేసిందని, దీనిపై విచారణ చేపట్టాలని సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. 

rhea shocked by enforcement derectorate must attend trial
Author
Hyderabad, First Published Aug 7, 2020, 10:54 AM IST

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తికి ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) షాక్‌ ఇచ్చింది. సుప్రీంకోర్ట్ తీర్పు వరకు ఈడీ తనపై విచారణను వాయిదా వేయాలన్న ఆమె కోరికని ఈడీ తిరస్కరించింది. సమన్లు పంపినట్టుగానే నేడు(శుక్రవారం) తమ ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. దీంతో రియాకి దిమ్మతిరిగిపోయింది. 

సుశాంత్‌ కేసులో మనీలాండరింగ్‌ జరిగిందన్న కోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. దాదాపు రూ.15కోట్లు సుశాంత్‌ అకౌంట్ల నుంచి రియా కొట్టేసిందని, దీనిపై విచారణ చేపట్టాలని సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. సుశాంత్‌ కేసు సీబీఐకి అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు ఈడీ సైతం తమ విచారణ వేగవంతం చేసింది. అందులో భాగంగా సుశాంత్‌ ప్రియురాలు రియాని శుక్రవారం తమ ముందు హాజరు కావాలని మూడు రోజుల క్రితం సమన్లు జారీ చేసింది. 

కన్నీళ్ళు పెట్టిస్తున్న సుశాంత్‌ మరణంపై సమీర్‌ శర్మ చివరిపోస్ట్..!

దీనిపై రియా గురువారం స్పందిస్తూ కేసుని బీహార్‌ నుంచి ముంబయి పోలీసులకు అప్పగించాలని సుప్రీంకోర్ట్ లో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనికి సంబంధించిన ప్రత్యుత్తరాలను తమకి సమర్పించాలని అటు ముంబయి పోలీసులను, ఇటు బీహార్‌ పోలీసులను సుప్రీం ఆదేశించింది. దీనిపై సుప్రీం తీర్పుని వెలువరించాల్సి ఉంది. ఈ తీర్పు వచ్చేంత వరకు తమ స్టేట్‌మెంట్‌ రికార్డింగ్‌ని వాయిదా వేయాలని రియా గురువారం ఈడీని రిక్వెస్ట్  చేస్తూ ఓ మెయిల్‌ పంపింది. 

తాజాగా ఈడీ స్పందించి కచ్చితంగా రియా తమ ముందు హాజరు కావాల్సిందే అని స్పష్టం చేసింది. దీంతో సుప్రీం కోర్ట్ కు అతీతంగా రియా ఈ రోజు ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. ఇక ఈ కేసుకు సంబంధించి రియా నుంచి ఆమె వ్యక్తిగత వివరాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు, ఇన్వెస్ట్ మెంట్ కాపీలు, బ్యాంక్‌ లావాదేవీలు వంటి అంశాలను ప్రశ్నించి రికార్డ్ చేయనున్నారు. మరి ఇందులో ఎలాంటి నిజాలు వెల్లడవుతాయో చూడాలి. 

 రియాకి సంబంధించి ఇటీవల భారీ ఆస్తులు బయటపడ్డాయి. ఆమె పేరుతో ముంబయిలోని ఖర్‌లో దాదాపు ఎనబై లక్షల విలువైన రూ.85 లక్షల విలువైన ప్లాట్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిలో హౌస్‌లోన్‌ వాటా 60 లక్షల రూపాయలు. ప్టాట్‌ విస్తీర్ణం 550 చదరపు అడుగులు ఉండగా, రియా తండ్రి రిటైర్డ్‌ డిఫెన్స్‌ అధికారి పేరు మీద మరో ప్లాట్‌ ఉన్నట్లు ఈడీ గుర్తించింది. దీన్ని 2012లో కొనుగోలు చేసి.. 2016లో స్వాధీనం చేసుకున్నారు. 1130 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాట్‌ విలువ రూ.60 లక్షలు కాగా, ఇది రాయ్‌గఢ్‌ జిల్లాలోని ఉల్వేలో ఉన్నట్లు సమాచారం. ఆమెకి ఇంత డబ్బు ఎలా వచ్చిందనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios