Asianet News TeluguAsianet News Telugu

కన్నీళ్ళు పెట్టిస్తున్న సుశాంత్‌ మరణంపై సమీర్‌ శర్మ చివరిపోస్ట్..!

సుశాంత్‌ ఆత్మహత్యని ఉద్దేశించి సమీర్‌ శర్మ గత నెల 22న పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. సుశాంత్‌ డిప్రెషన్‌తో చనిపోయినట్టు పోలీసులు ప్రాథమికంగా తెలియజేయడంతో సమీర్‌ దాన్ని ఉద్దేశించి ఓ పెద్ద పోస్ట్ ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇందులో డిప్రెషన్‌ గురించి చాలా వివరంగా వివరించారు. అనేక విషయాలను పంచుకున్నారు. 

sameer sharma post on sushant death brings tears
Author
Hyderabad, First Published Aug 7, 2020, 9:40 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హిందీ టీవీ నటుడు సమీర్‌ శర్మ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతను కూడా మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నట్టు అర్థమవుతుంది. అదే సమయంలో సమీర్‌ ఆత్మహత్య కూడా ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆయన హఠాన్మరణం టీవీ పరిశ్రమలో, వారి కుటుంబ సభ్యులను తీవ్ర వేదనకు గురి చేస్తుంది. తాజాగా ఆయనకు వారి కుటుంబ సభ్యులు సంతాపం తెలియజేశారు. ఆయన నటించిన `యే రిష్తే హై ప్యార్‌ కే` అనే సీరియల్‌ టెలివిజన్‌లో ప్రసారం కావడంతో దాన్నిచూసి కన్నీరు మున్నీరవుతున్నారు. 

తాజాగా సుశాంత్‌ ఆత్మహత్యని ఉద్దేశించి సమీర్‌ శర్మ గత నెల 22న పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. సుశాంత్‌ డిప్రెషన్‌తో చనిపోయినట్టు పోలీసులు ప్రాథమికంగా తెలియజేయడంతో సమీర్‌ దాన్ని ఉద్దేశించి ఓ పెద్ద పోస్ట్ ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇందులో డిప్రెషన్‌ గురించి చాలా వివరంగా వివరించారు. అనేక విషయాలను పంచుకున్నారు. 

`సుశాంత్‌ ప్రధానంగా డిప్రెషన్‌తో చనిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు. డిప్రెషన్ ని తక్కువ అంచనా వేయోద్దు. డిప్రెషన్‌ ఒంటరితనం వల్ల వస్తుంది. ఈ క్రమంలో అది అర్థం చేసుకునే విషయాన్ని మార్చేస్తుంది. సుశాంత్‌ ప్రధానంగా బైపోలార్‌ డిజార్డర్‌తో బాధపడినట్టు అర్థమవుతుంది. దీని ప్రకారం మన ఫీలింగ్స్ ఏంటో మనకే అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది` అని తెలిపారు. 

ఇంకా చెబుతూ, `ఒంటరి తనం వల్ల వచ్చే ఈ జబ్బు మనల్ని మరింత ఒంటరి చేస్తుంది. మన చుట్టు పక్కల ఎవరు ఉన్నారో, ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. మనం ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితి ఉంటుంది. మానసికంగా చాలా బలహీనంగా మారిపోతాం. విల్‌ పవర్‌ని కోల్పోతాం. ఒక సైకోలాగా మారిపోతాం. సుశాంత్‌ విషయంలో అదే జరిగి ఉండొచ్చు. ఆయన తన క్లిష్ట పరిస్థితిపై ఎంతగానో ఫైట్‌ చేసి ఉంటాడు. ఎంతో బాధని భరించి ఉంటాడు. అతని జీవితం తన కంట్రోల్‌ తప్పిపోయింది. ఇది సుశాంత్‌ విషయం గురించే కాదు, డిప్రెషన్‌కి గురైన ప్రతి ఒక్కరికి ఇలానే జరుగుతుంది. అయితే అది సామాజికపరమైన సమస్యనో, ఆర్థిక ఇబ్బంది అయితే ఇంతటి సమస్య ఉండదు. దాన్నుంచి బయటపడటం పెద్ద సమస్య కాదు, ఆ ఇబ్బందులు ఎన్ని రోజులుండవు. కానీ ఇది దాన్ని మించిన సమస్య` అని వివరించారు. 

`ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఒక ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు కాన్సర్‌తో బాధపడుతున్నారు, మరొకరు డిప్రెషన్‌తో బాధపడుతున్నారనుకో..  చాలా మంది కాన్సర్‌ పేషెంట్‌ విషయంలో సానుభూతి చూపుతారు. కానీ నేను డిప్రెషన్‌ వ్యక్తిని హగ్‌ చేసుకుంటా. ఎందుకంటే డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తికి ఉండే బాధ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అది కేవలం మెంటల్‌ హెల్త్ కి సంబంధించిన విషయం. మెడికేషన్‌, థెరపీతో దాన్ని క్రమంగా తగ్గించవచ్చు. అది రెగ్యూలర్‌గా చేయాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇష్టమైన వాళ్ళు డిప్రెషనల్‌లో ఉన్న వారిపై అమితమైన ప్రేమ, ఆప్యాయతలు పంచాలి. మళ్ళీ రెగ్యూలర్‌ లైఫ్‌లోకి తీసుకురావాలి. ఒక హగ్‌, ప్రేమ అతనికి ఎంతో ధైర్యాన్నిస్తుంది. తన సమస్యపై తాను పోరాడే శక్తినిస్తుంది. డిప్రెషన్‌లోకి వెళ్ళిన వ్యక్తిని ఎట్టిపరిస్థితుల్లో కించపరచకూడదు, తక్కువ చేయకూడదు. అది మరింతగా ఒత్తిడికి గురి చేస్తుంది` అని పేర్కొన్నారు. 

ఇప్పుడీ పోస్ట్ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నెటిజన్లని కన్నీళ్ళు పెట్టిస్తుంది. అంతేకాదు సమీర్‌ శర్మ పోస్ట్ ని బట్టి తను కూడా డిప్రెషన్‌ని అనుభవించి ఉన్నాడని ఈ పోస్ట్ ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఆత్మహత్య విషయంలోనూ పలు కోణాలు బయటపడుతున్నాయి. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios