Asianet News TeluguAsianet News Telugu

RGV: ‘సిరివెన్నెలకి ఓ ముద్దు’.. ఆర్జీవీ నోట సిరివెన్నెల పాట

కాంట్ర‌వ‌ర్సీల కింగ్ ఆర్జీవీ.. సిరివెన్నెల మ‌ర‌ణంలో చాలా ఎమోష‌న‌ల్ అవుతున్నారు.తాజాగా మరో ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. 5 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో వర్మ, సిరివెన్నెల సీతారామా శాస్త్రి గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆర్జీవీ నోట సిరివెన్నెల పాట పాడారు. 
 

Rgvs A Kiss To Sirivennela Seetharama Sastry
Author
Hyderabad, First Published Dec 5, 2021, 11:36 AM IST

వివాదాలకు కేరాఫ్ అడ్రాస్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma).. ఆర్జీవీ ఏం చేసిన సంచలనమే.. ఆయ‌న సినిమాల కంటే..ఆయ‌న‌ నెట్టింట్లో చేసే రచ్చ ఏవిధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయ‌న త‌రుచు ఏదొక కాంట్రవర్శీ కామెంట్ చేస్తూ.. వివాదాల‌కు తెర తీస్తారు. అందుకే ఆర్జీవీ కాంట్ర‌వ‌ర్సీకి అడ్డాగా మారారు. అయితే.. తాజాగా కాంట్రవర్శీల కింగ్ రామ్ గోపాల్ వర్మ సిరివెన్నెల మరణం విషయంలో మాత్రం చాలా ఎమోషనల్ అవుతున్నారు. త‌న‌దైన శైలిలో నివాళుల‌ర్పిస్తున్నారు. తొలుత ఓ ఆడియో క్లిప్ రూపంలో నివాళుల‌ర్పించారు. 

"మీరు చాలా లక్కీ సార్ .. స్వర్గానికి వెళ్లిపోయారు. అక్కడ వాట్సాప్‌ లాంటివి ఏమైనా ఉంటే.. అక్క‌డ ఎలా ఉందో ? అమృతం ఎలా ఉందో?  చెప్పండి. రంభ, ఊర్వశి, మేనక ఎలా ఉన్నారో చెప్పండి సార్. నేను ఒక ప్రేక్షకుడిగా నా స్వార్థంతో నేను అడుగుతున్నాను.  మీరు అక్కడికి వెళ్లడం నాకు హ్యాపీగా ఉంది. నేను కూడా త్వ‌ర‌లో వస్తా.. మీరు ఉండే స్వర్గానికి’ అంటూ ఆడియో విడుద‌ల చేశారు.

Read also: https://telugu.asianetnews.com/entertainment/interesting-details-about-katrina-kaif-and-vicky-kaushal-wedding-r3mhrm

 

తాజాగా.. మ‌రోసారి రామ్‌గోపాల్ వర్మ సిరివెన్నెలపై త‌న అభిప్రాయాన్ని చెప్పుతూ..నివాళులు అర్పించారు.  సిరివెన్నెల కి ఓ ముద్దు అనే క్యాప్షన్ తో యూట్యూబ్ లో వీడియోని విడుద‌ల చేశాడు. ఈ వీడియోలో సిరివెన్నెల‌పై ఆయ‌న‌కున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆయనకు ఎంతో ఇష్టమైన పాట పాడాడు. సిరివెన్నెల పేరులోనే త‌న ఆలోచ‌న విధానం ఉంద‌ని, వ్య‌క్తిగా ఆయనలో ఉన్న భావాల వ‌ల్లే మంచి మంచి పాటలు రాయగలిగారని అన్నారు. ఎప్పుడూ ఒప్పుకో వ‌ద్దురా ఓట‌మి” అంటూ సిరివెన్నెల రాసిన పాటను త‌న గొంతుతో పాడి వినిపించారు రామ్ గోపాల్ వర్మ. చివ‌ర‌కి  సిరి వెన్నెల ఫోటోకు ముద్దు పెట్టారువర్మ. ఇప్పుడూ ఆర్జీవి వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

Read Also: https://telugu.asianetnews.com/entertainment/sunny-shanmukh-siri-learn-more-in-bigg-boss-telugu-5-show-nagarjuna-punches-r3lpkr

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహితీ లోకంలో త‌న‌కంటూ ఓ చెరిగిపోని సంతకం చేశారు . ఆయ‌న న్యూమోనియోతో బాధపడుతూ కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మంగళవారం (నవంబర్‌ 30)న తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల కన్నుమూయడంతో ఎన్నో అద్భుతమైన పాటలకు ప్రాణం పోసిన ఆయన కలం మూగబోయింది. ఆయ‌న 37 ఏండ్ల సినీ ప్ర‌స్థానంలో మూడు వేల‌కు పైగా పాట‌లు రాశారు. సాహితీవేత్త మరణ వార్త విన్న సామాన్య అభిమానులతో పాటు తోటి సినీ కళాకారులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.  

Follow Us:
Download App:
  • android
  • ios