Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 5: సన్నీకి చదువు గొప్పదనం నేర్పిస్తే, షణ్ముఖ్‌కి కోపం తగ్గించిందట.. నాగ్‌ పంచ్‌లు.. నవ్వులే

ఈ రోజు ఎపిసోడ్‌లో ఇంటి సభ్యుల మధ్య గత టాస్క్ లకు సంబంధించిన డిస్కషన్‌ జరిగింది. అనంతరం ఫ్యాషన్‌ క్యాట్‌ వాక్‌ పెట్టారు. స్టయిలీష్‌ గ్లాసెస్‌తో సభ్యులంతా ఆకట్టుకున్నారు. ఇందులో షణ్ముఖ్‌, కాజల్‌ విన్నర్‌గా, రన్నరప్‌గా నిలిచారు. 

sunny shanmukh siri learn more in bigg boss telugu 5 show nagarjuna punches
Author
Hyderabad, First Published Dec 4, 2021, 10:52 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg Boss Telugu 5).. 91వ ఎపిసోడ్‌కి చేరుకుంది. శనివారం ఎపిసోడ్‌ ఆద్యంతం కామెడీగా సాగింది. నాగార్జున వచ్చి ఇంటి సభ్యులకు కొన్ని పరీక్షలు పెట్టి అందులోనూ కామెడీ యాంగిల్‌ని బయటకు తీసుకొచ్చారు. దీంతో ఈ వారం చప్పగా సాగగా, ఈ శనివారం ఎపిసోడ్‌ మాత్రం ఆ లోటుని పూరించిందని చెప్పొచ్చు. Bigg Boss Telugu 5ఈ రోజు ఎపిసోడ్‌లో ఇంటి సభ్యుల మధ్య గత టాస్క్ లకు సంబంధించిన డిస్కషన్‌ జరిగింది. అనంతరం ఫ్యాషన్‌ క్యాట్‌ వాక్‌ పెట్టారు. స్టయిలీష్‌ గ్లాసెస్‌తో సభ్యులంతా ఆకట్టుకున్నారు. ఇందులో షణ్ముఖ్‌, కాజల్‌ విన్నర్‌గా, రన్నరప్‌గా నిలిచారు. 

అనంతరం.. వాహ్‌ తాజ్‌ టీ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఈ షో ద్వారా మీ గురించి మీరు ఏం తెలుసుకున్నారనేది చెప్పాల్సి ఉంటుంది. ఇందులో షణ్ముఖ్‌ తనకు బయట ఓపిక ఉండదని, ఇందులో ఆ ఓపిక వచ్చిందన్నారు. సిరి చెబుతూ, తాను ఇప్పటి వరకు ఇండిపెండెంట్‌ అనుకున్నానని, ఈ షో ద్వారా తాను డిపెండెంట్‌ అని చెప్పింది. సన్నీ షో వల్ల వచ్చిన మార్పు గురించి చెబుతూ, చదువుకోవాలని తెలిపారు. చదువుకుంటే కాన్ఫిడెంట్‌ వస్తుందని తన విషయంలో ఆ రిగ్రెట్‌ ఉందన్నారు. పింకీ చెబుతూ తాను అంతకు ముందు తనకి నచ్చినట్టుగా ఉండేదని, కానీ అలా ఉండకూడదని తెలుసుకున్నట్టు చెప్పింది. 

శ్రీరామ్‌ తాను ఇంత మందితో ఉండగలగడం గురించి మార్పు వచ్చిందన్నారు. మానస్‌ తను మాట్లాడటం తక్కువగా ఉండేదని ఆ విషయంలో మార్పుని గమనించినట్టు చెప్పారు. కాజల్‌.. తన ఫ్యామిలీ లేకపోతే తాను ఉండలేనని తెలిపింది. అనంతరం కంప్లైంట్‌ టాస్క్ లో ఇతర సభ్యులపై తనకు ఉన్న కంప్లెంట్‌ ఏంటనేది తెలిపారు. ఈ టాస్క్ నవ్వులు పూయించింది. మరోవైపు ఇంటి సభ్యులపై ఉన్న కంప్లెయింట్‌ నాగ్‌ సైతం వెల్లడించారు. గేమ్‌లో వాళ్లు చేసిన మిస్టేక్స్ చెప్పి కామెడీ పండించారు. అనంతరం `టికెట్‌ టు ఫినాలె`లో ఫైనల్‌కి చేరిన శ్రీరామ్‌కి గ్రాండ్‌గా వెల్ కమ్‌ పలికారు నాగ్‌. అదే సమయంలో ఆయన ఈ వారంలో నామినేషన్‌ నుంచి సేవ్‌ కావడం విశేషం. 

అనంతరం మరో టాస్క్ ఇచ్చాడు నాగ్‌. ఇందులో పలు ఫీలింగ్స్ తో ఉన్న ఎమోజీలను ఉంచి, అవి ఎవరికి వర్తిస్తాయో చెప్పాల్సి ఉంటుంది. ఇందులో శ్రీరామ్‌..గేమ్‌లో రాక్షసుడని సన్నీకి పంచ్‌ ఇచ్చాడు. కాజల్‌కి నోరు ముయ్ అని, పింకీపై తనకున్న కోపాన్ని వెల్లడించింది. మరోవైపు సన్నీ చెబుతూ తాను కాజల్‌కి నోరుమూసుకో అనే ఎమోజీని ఇస్తానని, సిరిపై కోపం ఉందని, షణ్ముఖ్‌కి పంచ్‌ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపారు. షణ్ముఖ్‌ చెబుతూ, కాజల్‌పై కోపం ఉందని, సిరికి పంచ్‌ ఇవ్వాలనుకుంటున్నట్టు, పింకీకి నోరు మూసుకో అనే ఎమోజీ ఇస్తానని చెప్పారు. పింకీ చెబుతూ, సిరికి పంచ్‌ ఇవ్వాలనుకుంటున్నట్టు, సన్నీపై కోపం ఉందని, మానస్‌ని నోరు మూసుకో అని ఎమోజీలిచ్చింది. 

మానస్‌ చెబుతూ, సిరిపై కోపం ఉందని, సన్నీకి పంచ్‌ ఇవ్వాలనుకుంటున్నట్టు, పింకీకి నోరు మూసుకో అని ఎమోజీ ఇచ్చాడు. కాజల్‌ చెబుతూ, శ్రీరామ్‌కి పంచ్‌, షణ్ముఖ్‌పై కోపం ఉందని, నోరు మూసుకో అని సన్నీకి ఇచ్చింది. సిరి చెబుతూ, సన్నీకి నోరు మూసుకో అని, షణ్ముఖ్‌కి పంచ్‌ ఇవ్వాలనుకుంటున్నట్టు, పింకీపై కోపం ఉందని చెప్పింది. అనంతరం గతంలో తన ఫ్యామిలీ మెంబర్స్ కోసం త్యాగం చేసిన వస్తువులను ఇప్పించాడు నాగ్‌. అయితే టాప్‌ 5లో ఉన్న వారి వస్తువులే వచ్చాయి. అలా శ్రీరామ్‌, షణ్ముఖ్‌, సన్నీ, కాజల్‌, మానస్‌లకు తమ వస్తువులు వచ్చాయి. కానీ సిరి, పింకీలకు రాలేదు. వీరిద్దరికి ఎక్కువ మంది ఓట్లు వేయలేదని అందుకే ఇవ్వడం లేదని తెలిపారు నాగ్‌. 

అయితే వీరిలో ఎవరు హౌజ్‌లో ఉండేందుకు అర్హులు అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా పింకీ, సిరిలలో ఎవరికి సపోర్ట్ చేస్తారో, వాళ్లకి తులాభారం తమ వస్తువులను త్యాగం చేయాల్సి ఉంటుందని చెప్పాడు నాగ్‌. ఒకరు ఒక్కరికే త్యాగం చేయాలని చెప్పారు. ఈ టాస్క్ లో ముందు ఇద్దరికి టై అయ్యింది. దీంతో మరో 30సెకన్లు ఇవ్వగా, సిరి  గెలిచింది. ఆమె త్యాగం చేసిన బ్రాస్‌లెట్‌ పొందింది. పింకికి మాత్రం రాలేదు. అనంతరం నామినేషన్లలో ఉన్నవాళ్లలో ఎవరు సేవ్‌ అవుతారు, ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది రేపు(ఆదివారం) ఎపిసోడ్‌లో చూద్దామన్నారు నాగ్‌. ఈ వారం నామినేషన్లలో ఉన్న శ్రీరామ్‌ సేవ్‌ కాగా, సిరి, పింకీ, మానస్‌, కాజల్‌ మిగిలి పోయారు. వీరిలో పింకీ ఎలిమినేట్‌ అవుతుందని తెలుస్తుంది.

also read: Bigg Boss Telugu5: బిగ్ బాస్ లీక్.. హౌస్ నుండి ప్రియాంక అవుట్... మానస్ పరిస్థితి ఏమిటో!

Follow Us:
Download App:
  • android
  • ios