Asianet News TeluguAsianet News Telugu

Omicron: ఓ మైగాడ్.. 'ఒమిక్రాన్' వల్ల భూమి స్మశానంగా మారుతుందా, వణుకు పుట్టిస్తున్న ఆర్జీవీ పోస్ట్

కరోనా ఇంకా మానవాళిని విడిచిపెట్టి వెళ్ళలేదు. తగ్గినట్లే తగ్గి కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలు కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్' గురించి ఆందోళన చెందుతున్నాయి. 

RGV sensational post on Omicron variant
Author
Hyderabad, First Published Dec 2, 2021, 4:59 PM IST

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన విషయాల గురించి చాలా త్వరగా స్పందిస్తారు. ఆర్జీవీ కామెంట్స్, వివాదాలు మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. కరోనా ఇంకా మానవాళిని విడిచిపెట్టి వెళ్ళలేదు. తగ్గినట్లే తగ్గి కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలు కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్' గురించి ఆందోళన చెందుతున్నాయి. 

ఒమిక్రాన్(Omicron) ఇప్పటికే 24 దేశాల్లో విస్తరించినట్లు చెబుతున్నారు. కోవిడ్ గత వేరియంట్ల కంటే ఇది ఆరు రెట్లు వేగంగా వ్యాపిస్తోందని చెబుతున్నారు. దీనితో ఒమిక్రాన్ పై ప్రతి ఒక్కరిలో ఆందోళన నెలకొంది. ఇదిలా ఉండగా ఆర్జీవీ(Ram gopal Varma) సోషల్ మీడియాలో ఒమిక్రాన్ గురించి చేసిన పోస్ట్ షాకింగ్ గా ఉంది. 

'ది ఒమిక్రాన్' పేరుతో 1963లో ఇటాలియన్ భాషలో చిత్రం తెరకెక్కింది. ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ని కూడా ఒమిక్రాన్ అనే పిలుస్తున్నారు. దీనితో అందరూ ఈ చిత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్జీవీ ది ఒమిక్రాన్ చిత్ర పోస్టర్ ని పోస్ట్ చేశాడు. ఈ సినిమాకి ఉన్న ట్యాగ్ లైన్ చదవండి అని కామెంట్ పెట్టాడు. 

ఈ చిత్రానికి ఉన్న ట్యాగ్ లైన్ వణుకు తెప్పించే విధంగా ఉంది. ' భూమి స్మశానంగా మారిన రోజు' అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఈ చిత్రం గురించి పోస్ట్ చేశారు. 'కంటికి కనిపించని ఓ గ్రహాంతర వాసి(alien) చనిపోయిన ఓ ఫ్యాక్టరీ కార్మికుడు డెడ్ బాడీని స్వాధీనం చేసుకుంటుంది. భూమిని తన కంట్రోల్ లోకి తెచ్చుకునేందుకు ఫ్యాక్టరీ కార్మికుడిగా తిరిగి భూమిపైకి వస్తుంది. ఈ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. 

ఆర్జీవీ పోస్ట్ తో నిజంగా ఒమిక్రాన్ ఈ భూమిని స్మశానంగా మార్చబోతోందా అనే చర్చ నెటిజన్ల మధ్య జరుగుతోంది. ఒమిక్రాన్ అనేది గ్రీకు భాషకు చెందిన పదం. 15వ అక్షరం 'O ' అని అర్థం వస్తుంది. ఒమిక్రాన్ పదాన్ని గతంలో చాలా చోట్ల వాడి ఉండవచ్చు. అలాగే సినిమా కూడా తీశారు. దానికి  ఒమిక్రాన్ వేరియంట్ కి సంబంధం లేదు.. భయపడకండి అంటూ మరికొందరు నెటిజన్లు ఆర్జీవీ పోస్ట్ కి కామెంట్స్ పెడుతున్నారు. 

ఒమిక్రాన్ ప్రపంచ దేశాలలో వేగంగా వ్యాపిస్తుండడంతో ఇండియా కూడా అప్రమత్తమైంది.  విదేశాల నుంచి వస్తున్న వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కూడా ఒమిక్రాన్ చాలా ప్రమాదకరమైంది అంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది.      

Also Read: ప్యాంట్ వేసుకోవడం మరచిపోయిందా.. అనసూయ అందాల విస్ఫోటనం, లెగ్స్ హాట్ నెస్ నెక్స్ట్ లెవల్

Follow Us:
Download App:
  • android
  • ios