దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ వైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ కి సంబందించిన అప్డేట్స్ ను అందిస్తూనే ఇతర సినిమాలపై తన టంగ్ పవర్ ను తెగ చూపిస్తున్నాడు. రీసెంట్ గా మణికర్ణిక సినిమాను చూసి ఫిదా అయిన ఈ విలక్షణ దర్శకుడు హీరోలను హీరోయిన్స్ తో పోల్చడం వైరల్ గా మారింది. 

కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక సినిమా నిన్న వరల్డ్ వైడ్ గా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ అందుతుండగా వర్మ కూడా తన వివరణ ఇచ్చాడు. కంగనా నటన అద్భుతంగా ఉందని మణికర్ణిక సినిమాలో ఒక గ్రేట్ హీరోగా కంగనా కనిపించిందని అన్నారు. అదే విధంగా ఆమె ఉగ్రరూపం ధీరత్వం బాగున్నాయని చెబుతూ కంగనా నటనతో పోల్చితే యాక్షన్ హీరోలంతా నాకు హీరోయిన్స్ గా కనిపిస్తారు అని ట్విట్టర్ ద్వారా ఆర్జీవీ వివరణ ఇచ్చాడు. 

మణికర్ణిక సినిమాకు మొదట టాలీవుడ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కించగా షూటింగ్ చివరలో హీరోయిన్ తో విబేధాలు ఏర్పడి తప్పుకున్నారు. దీంతో కంగనా ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. వీరనారి ఝాన్సీ లక్ష్మి భాయి జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కథను విజయేంద్ర ప్రసాద్ అందించారు.    

asianet news special

లక్ష నుంచి 25 కోట్లు.. తెలుగు ఓల్డ్ మూవీస్ కలెక్షన్స్ (1933-2002)

బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన బాక్స్ ఆఫీస్ కథలు!