నందమూరి బాలకృష్ణకు లక్ష్మిస్ ఎన్టీఆర్ కు దగ్గరి సంబంధం ఉందని విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కనిపించిన ప్రతి మీటింగ్ లో చెబుతున్నాడు. అసలు బాలకృష్ణ వర్మను కలవకపోయి ఉంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉండేదే కాదట. గతంలో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి వర్మను కలిసిన సంగతి తెలిసిందే. 

రక్త చరిత్ర సినిమా చూసిన బాలకృష్ణ పరిటాల లైఫ్ ను అద్భుతంగా చూపించారని అప్పటి నుంచి వర్మతో బాగానే టచ్ లో ఉన్నారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కూడా క్లిక్కవ్వడంతో ఆయన మేకింగ్ కు బాలకృష్ణ ఫిదా అయిపోయారు. దీంతో వెంటనే ముంబై వెళ్లి మరీ వర్మను కలిశారు బాలకృష్ణ. ఇక వర్మ అప్పుడే ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. 

ఆ తరువాత వర్మ కేవలం లక్ష్మీస్ ఎన్టీఆర్ పార్ట్ మాత్రమే నచ్చింది అని బయటకు చెప్పడంతో బాలకృష్ణ వర్మను మళ్ళీ కలవలేదు. బాలయ్య కలవడం వల్లే ఆ నాటి సంఘటనలు ఒక్కసారిగా మదిలో మెదిలాయని అంతకంటే బెస్ట్ కథ మరోటి ఉండదని ఆ విధంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ను మొదలెట్టాడు. మొత్తానికి బాలకృష్ణ తన వద్దకు రాకుంటే ఈ పాయింట్ తన మైండ్ లోకి వచ్చేదే కాదని వర్మ సమాధానం ఇస్తున్నాడు.  

అన్నగారి బాక్స్ ఆఫీస్ స్టామినా.. సీనియర్ ఎన్టీఆర్ హిట్స్