Krishna Mukunda Murari:స్టార్ మాలో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో వస్తుంది. దీంతో ఈ సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకుపోతూ అందరిని అలరిస్తుంది. ఇక ఈ రోజు మార్చి 6 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.  

ఎపిసోడ్ ప్రారంభం లో పెళ్లయిన ఆడది తన భర్తనే తలవాలి అనేది అక్షర సత్యం అంటాడు మురారి. నువ్వు ఇప్పుడు కథలు బానే చెప్తున్నావ్ కానీ నా జీవితాన్ని నీ స్నేహితుడికి ధారధత్తం చేసిన రోజు గుర్తుకు రాలేదా అంటుంది ముకుంద. ఇప్పుడు మన ప్రేమ కథని తగ్గటానికి రాలేదు అని మురారి అంటే నీ భార్యకి ఇలవేల్పు లాంటి స్థానాన్ని ఇవ్వమని చెప్పటానికి వచ్చావా అంటుంది ముకుంద.

కాదు ఇంటి ఇల్లాలుగా గుర్తించమని చెప్పటానికి వచ్చాను అయినా మా భార్యని పిక్ చేసుకొని డ్రాప్ చేసుకుంటే నీకేంటి బాధ, మురారి నీకు డ్రైవర్ అని అడిగావంట, అది నా ఇష్టం నా బాధ్యత. డ్రాప్ చేస్తాను పికప్ చేసుకుంటాను అవసరమైతే అంతకన్నా ఖరీదైన కారు కొనిచ్చి డ్రైవర్ని పెడతాను నచ్చకపోతే చూస్తూ ఉండు అంతేకానీ అవమానిస్తే ఊరుకోను అంటాడు మురారి. ఇప్పుడు తిరగబడితే నా మీద ఉన్న కాస్త ప్రేమ కూడా చచ్చిపోతుంది.

 ఎలాగో వెళ్లిపోయేదాన్ని రెచ్చగొట్టి ఇక్కడే ఉండేలాగా చేయకూడదు అనుకుని కామ్ గా ఉండిపోతుంది ముకుంద. కృష్ణ నా భార్య అని ఈ ఇంటి కోడలని ముఖ్యంగా ఒక మనిషి అని గుర్తుపెట్టుకో అని ముకుందని హెచ్చరించి వెళ్లిపోతాడు మురారి. నేను మారను నన్ను ఇంతకన్నా రెచ్చగొడితే మా ప్రేమ గురించి నిజం చెప్పేస్తాను అనుకుంటుంది ముకుంద.

మరోవైపు పడుకున్నాను కృష్ణ దగ్గరికి వచ్చి ఎందుకు పడుకున్నావు అని అడుగుతాడు. నీరసంగా ఉంది అని కృష్ణ అంటే సరే భోజనం చేద్దాం రా అంటాడు మురారి. రాగానే కడుపునిండా పెట్టారు అందుకే ఇప్పుడు భోజనం వద్దు అంటుంది కృష్ణ. కృష్ణ మురారి మీద అలగవచ్చు కానీ అన్న మీద అలగకూడదు భోజనం మానేస్తే నీరసం వస్తుంది అని నచ్చచెప్తాడు మురారి.

నాకు ఇక్కడే బాగుంది సార్ కిందకి వస్తే పరాయి వాళ్ళ మధ్య తిరుగుతున్నట్లుగా ఉంది, ఎప్పుడు ఎవరు ఏమంటారో అని భయంగా ఉంది. ఇక్కడ మీతో ఉంటేనే నిశ్చింతగా ఉంది అంటుంది కృష్ణ. నిన్ను ఎవరు ఏమంటారు నీకు నేనున్నాను కదా బెదిరిపోకు భయపడకు ఒంటరిగా ఫీల్ అవ్వకు, నువ్వు ఇప్పుడే వస్తాను అని కిందకి వెళ్తాడు మురారి. కృష్ణకి భోజనం తీసుకుని పైకి వెళుతుండగా ముకుంద అడ్డు వచ్చి కృష్ణ కా అని అడుగుతుంది.

అవును అని మురారి అంటే చాటుగా తీసుకెళ్లవలసిన అవసరం ఏముంది ఇందాక జరిగినా గొడవకి రానందా అంటుంది ముకుంద. తీసుకెళ్తే తప్పేంటి అంటాడు మురారి. ఏమీ తప్పులేదు నువ్వు నీ భార్య నీ సంసారం నీకు ఎలా నచ్చితే అలా చెయ్యు మధ్యలో నేను ఎవరిని, నాతో ఏ అనుబంధం లేదు అంతే కదా అంటుంది ముకుంద. నేను భోజనం తీసుకెళ్లడానికి, అనుబంధానికి అసలు సంబంధం ఏముంది అంటాడు మురారి.

తనని వచ్చి భోజనం చేయమను ఇలాగా భోజనాలు తీసుకెళ్లవలసిన కర్మ నీకేంటి అంటుంది ముకుంద. నువ్వు చూడలేకపోతున్నావా అని మురారి అంటే నువ్వు కృష్ణ మీద అంతా కేర్ తీసుకోవడం భరించలేకపోతున్నాను అంటుంది ముకుంద అది నీ తప్పు నీ ఆలోచన విధానంలోనే లోపం ఉంది అంటాడు మురారి. నేను చూస్తూ ఉండగా, ఇంత బాధ పడుతుండగా, నీ భార్యకి సేవలు చేస్తావన్నమాట అంటుంది ముకుంద.

తను నన్ను నమ్ముకుని ఈ ఇంటికి వచ్చింది అంటాడు మురారి. నేను నా ప్రేమని అమ్ముకొని ఇంట్లో పడి ఉన్నాను అంటుంది ముకుంద. నేను ఒక్క ప్రశ్న అడుగుతాను నిజం చెప్పు నేను ఒప్పించినంత మాత్రాన నువ్వు ఆదర్శ్ ని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నావు, వెళ్లి నీ అంతరాత్మని అడుగు అని అడుగుతాడు మురారి. ఊహించని ఆ ప్రశ్నకి షాక్ అవుతుంది ముకుంద.

అంతలోనే అక్కడికి వచ్చిన రేవతి ఇద్దరూ అక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. కృష్ణ కి బాగోలేదు అందుకే టిఫిన్ తీసుకు వెళ్తున్నాను అని మురారి అంటే నాతో చెప్పాల్సింది కదా తీసుకువచ్చే దాన్ని అయినా పర్వాలేదు తీసుకొని వెళ్ళు నేను పెద్దమ్మకి చెప్తాను అంటుంది రేవతి. వాళ్ళిద్దరూ చెరువు వైపు వెళ్ళిపోవడంతో వీళ్లిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని అనుమాన పడుతుంది రేవతి.

గదిలోకి టిఫిన్ తీసుకొచ్చిన మురారి కృష్ణ ని టిఫిన్ చేయమంటే నీరసంగా ఉంది అంటుంది. మీ గౌతమ్ సార్ వచ్చారంటూ ఆమెని కంగారు పెట్టేస్తాడు మురారి. కంగారుపడిన ఆమెను చూసి ఊరికే చెప్పాను ఎలాగో లేచావు కదా భోజనం చెయ్యు అంటే నీరసంగా ఉంది తినలేను అని మారం చేస్తున్న ఆమెని భయపెట్టి, బ్రతిమాలి తినిపిస్తాడు మురారి.

టిఫిన్ తిన్న తర్వాత కృష్ణని ఆమె తండ్రి ఫోటో దగ్గరికి తీసుకువెళ్లి నువ్వు మీ నాన్నకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి అంటే ఇంటా బయట చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని ఎదుర్కొని నిలబడాలి ఎలాంటి సమస్య ఎదురైనా కృంగిపోకూడదు. నీకు నీ గమ్యం ధ్యేయం ఇవే ముఖ్యం. నువ్వు ఈ ఇంట్లో ఎవరికైనా నచ్చకపోతే అది వాళ్ళ ప్రాబ్లం ఈ ఇంట్లో పెద్దవాళ్ల సంగతి కి వస్తే వాళ్ళు నిన్ను ఒక మాట అన్నా తప్పులేదు కాస్త ఓర్చుకుంటే నీకే మంచి పేరు వస్తుంది.

ఎప్పుడో ఒకసారి కోప్పడం సహజం అది వాళ్ళ పెద్దరికం అని కృష్ణకి ధైర్యం చెప్తాడు మురారి. మరోవైపు నందిని దగ్గరికి వచ్చి టాబ్లెట్ వేసుకోమని బ్రతిమాలతారు సుమ దంపతులు. నేను వద్దు అంటే నా చేత ఎందుకు బలవంతంగా టాబ్లెట్ వేస్తారు మీకు పిచ్చా అంటూ మారం చేస్తుంది నందిని. అంతలోనే అక్కడికి వచ్చిన భవాని వాళ్లని విసిగించకు టాబ్లెట్ వేసుకో అని మందలిస్తుంది.

నేను వేసుకోను అని మారం చేస్తుంటే అందరూ చెప్తున్నారు కదా వినొచ్చు కదా అంటుంది ముకుంద. కావాలంటే నువ్వు వేసుకో రాత్రంతా దెయ్యంలాగా తిరుగుతుంటావు కదా అంటుంది నందిని. మాటలకి కోప్పడుతుంది భవాని. ఎందుకు బెదిరిస్తున్నావు తను దెయ్యం అయితే నువ్వు పిశాచివి అంటూ అందరినీ తిడుతుంది నందిని. ఆమని పట్టుకొని టాబ్లెట్ వేయబోతుంటే గట్టిగా కేకలు వేస్తుంది నందిని. ఆ కేకలు విని కిందకి వస్తారు కృష్ణ దంపతులు.

తనని వదలండి అంటూ సుమ చేతిలో టాబ్లెట్ చూసి ఈ టాబ్లెట్ వేయకూడదు అంటుంది కృష్ణ. ఈ టాబ్లెట్ కచ్చితంగా రోజు వేసి తీరాలి అంటుంది భవాని. ఆ టాబ్లెట్ వద్దు వేసుకుంటే తల నొప్పిగా ఉండి నరాలన్నీ లాగేస్తున్నాయి అంటూ భయంగా చెప్తుంది నందిని. ఈ టాబ్లెట్ వేయొద్దని ముందే చెప్పాను కదా డాక్టర్ గారితో చెప్పి డోస్ కూడా తగ్గించమన్నాను కదా ఇవన్నీ స్టెరాయిడ్స్, ఇవి వేసుకుంటే బాడీ వీక్ అయిపోయి నరాలు తిట్లు పోయినట్లుగా కనిపిస్తాయి అంటుంది కృష్ణ.

నువ్వు జూనియర్ డాక్టర్ వి అప్పుడే కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసే సీనియర్ డాక్టర్ లాగా మాట్లాడుతున్నావేంటి అంటుంది ముకుంద. తరువాయి భాగంలో ఆ టాబ్లెట్ ఫిట్ ఇవ్వు నేను వేస్తాను అని కృష్ణ దగ్గర లాక్కుంటుంది భవాని. ఆమెకి అడ్డుగా నిలబడి ఈ టాబ్లెట్ ఇస్తే తను ఎప్పటికీ మామూలు మనిషి కాలేదు స్లో పాయిజన్ ఇది అంటుంది కృష్ణ. వారం రోజుల్లోనే తనని మామూలు మనిషిని చేస్తానంటూ మాటిస్తుంది.