రేణు దేశాయిని రెండో పెళ్లికి బలవంతం చేస్తున్నది ఎవరో తెలుసా?

renu desai second marriage thoughts provoked by akeera
Highlights

  • రెండోపెళ్లిపై మనసులో మాట వెలిబుచ్చిన రేణుదేశాయి
  • రేణు దేశాయి రెండోపెళ్లి చేసుకోవద్దంటూ పవన్ ఫ్యాన్స్ రచ్చ
  • తనకు తోడుకావాలంటున్న రేణు
  • మరో పెళ్లి చేసుకోవాలని తన కొడుకు అఖీరా కోరుతున్నాడన్న రేణు

ప‌వ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణుదేశాయ్ మ‌ళ్లీ పెళ్లికి రెడీ అవుతోందని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. రేణు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నుంచి 2010లో విడాకులు తీసుకున్న తర్వాత ప్ర‌స్తుతం త‌న ఇద్ద‌రు పిల్ల‌లు అకీరా, ఆద్య‌తో పుణెలో త‌ల్లిదండ్రుల వ‌ద్దే ఉంటోంది.

 

ప్ర‌స్తుతం తెలుగు బుల్లితెర‌మీద పాపుల‌ర్ డ్యాన్స్‌కు జ‌డ్జ్‌ గా వ్య‌వ‌హ‌రిస్తోన్న రేణు తాజ‌గా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె త‌న రెండో పెళ్లి విష‌యాన్ని ప్ర‌స్తావించింది. తాను రెండో పెళ్లి చేసుకుంటానంటే ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌రో పెళ్లి చేసుకోవ‌డం కుద‌ర‌దంటూ నానా ర‌చ్చ చేసిన విష‌యాన్ని ఆమె మ‌రోసారి ప్ర‌స్తావించారు. విడాకుల త‌ర్వాత ఒంట‌రిగా ఉంటోన్న త‌న‌కు ఓ తోడు కావాల‌ని, తాను అనారోగ్యంతో ఉన్న‌ప్పుడు త‌న బాధ్య‌త‌లు చూసే భ‌ర్త కావాల‌ని రేణు తెలిపింది.

 

ఇక రెండో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిన రేణు ముందుగా ఈ విష‌యాన్ని పెద్ద‌ల‌కు చెప్ప‌గా వారు హ్యాపీగా ఫీల్ అయ్యార‌ని, ఈ సారి మాత్రం తాను పెద్ద‌లు కుదిర్చిన పెళ్లే చేసుకుంటాన‌ని, ఇండ‌స్ట్రీ, పాలిటిక్స్‌ లో ఉన్న వ్య‌క్తుల‌ను మాత్రం పెళ్లి చేసుకోన‌ని చెప్పింది. ఈ కీల‌క టైంలో త‌న లైఫ్ గ‌జిబిజీగా ఉండ‌కూడ‌ద‌ని, అందుకే ఈ సారి మాత్రం త‌న‌కు కూల్‌గా కామ్‌గా ఉండే భ‌ర్తే కావాల‌ని చెప్పింది.

 

ఇక త‌న‌ను మ‌ళ్లీ పెళ్లి చేసుకోమ‌ని ఒత్తిడి తెస్తోన్న వారిలో త‌న కొడుకు అకీరా కూడా ఉన్నట్టుగా చెప్పుకొచ్చింది రేణు. ఇక తనకు రాబోయే భర్త తన ఇద్దరు పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలని… మంచి మనసున్న వ్యక్తి అయితే ఇంకా బెటర్ అని రేణు చెప్పింది. మ‌రి రేణుతో విడాకుల త‌ర్వాత ప‌వ‌న్ మ‌రో పెళ్లి చేసుకున్నాడు. అలాంటప్పుడు రేణు రెండో పెళ్లి చేసుకుంటే అభ్యంతరం ఎందుకో పవన్ ఫ్యాన్స్ కే తెలియాలి.

 

loader