రేణుదేశాయ్ రీఎంట్రీకి సిద్ధమవుతోందా..?

Renu Desai's Re-entry to Tollywood
Highlights

ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే రేణు ఆ తరువాత దానికి గుడ్ బై చెప్పేసి సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటోంది. అయితే తన రెండో పెళ్లి తరువాత రేణు సినిమాలు చేయడం ఖాయమని ఆమె సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఆమె ఓ సినిమా కోసం సంతకం చేయనుందని చెబుతున్నారు. 

ఒకప్పుడు హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైన రేణుదేశాయ్ ఆ తరువాత సినిమాలకు దూరమైంది. పవన్ ను పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైన రేణు ఆ తరువాత పవన్ నుండి విడిపోవడం తన పిల్లలతో కలిసి పూణేలో ఉండడం వంటి విషయాలు తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన కొందరు దర్శకనిర్మాతలు తమ సినిమాల్లో నటించమని ఆఫర్లు ఇచ్చారు.

కానీ తనకు నటించే ఆలోచన ప్రస్తుతానికి లేదని తిరస్కరించింది. కానీ ఇప్పుడు మరోసారి తన ముఖానికి మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతోందని సమాచారం. గతంలో తనకు సినిమాల మీద ధ్యాస లేదని చెప్పిన రేణు ఇప్పుడు మంచి అవకాశాలు వస్తే.. టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల తన రెండో పెళ్లి విషయంతో సోషల్ మీడియా హాట్ టాపిక్ అయిన రేణు.. పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసి పెద్ద దుమారానికి తెరలేపింది.

దానికి ముందు ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే రేణు ఆ తరువాత దానికి గుడ్ బై చెప్పేసి సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటోంది. అయితే తన రెండో పెళ్లి తరువాత రేణు సినిమాలు చేయడం ఖాయమని ఆమె సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఆమె ఓ సినిమా కోసం సంతకం చేయనుందని చెబుతున్నారు. మరి రేణు ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుందో చూడాలి!

loader