నేను ఉండగానే మరొకరితో ఎఫైర్.. బిడ్డను కూడా కన్నారు: పవన్ పై రేణు కామెంట్స్

First Published 7, Jul 2018, 4:21 PM IST
renu desai reveals reason behind her divorce with pawan
Highlights

పదకొండేళ్ల పాటు కలిసి కాపురం చేసిన పవన్ కళ్యాణ్ తనకు తెలియకుండా మరో మహిళతో ఎఫైర్ పెట్టుకొని ఓ బిడ్డను కూడా కన్నారని రేణు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్.. పవన్ నుండి విడిపోయి చాలా కాలం అవుతుంది. పిల్లల కోసం ఇద్దరూ అప్పుడప్పుడు కలుస్తుంటారు. పవన్ మూడో పెళ్లి చేసుకొని రాజకీయాల పరంగా బిజీ అయిపోయాడు. ఇక్కడ వరకు అభిమానులు బాగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే రేణు దేశాయ్ తన తోడు కోసం మరో వ్యక్తిని వివాహం చేసుకుంటుందని ప్రకటించిందో అప్పటినుండి సోషల్ మీడియాలో ఆమెను విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

కొందరి మాటలు మితిమీరడంతో ఆమె తన ట్విట్టర్ అకౌంట్ ను కూడా తీసేసింది. కానీ తను ఎదుర్కొంటోన్న మానసిక క్షోబ ప్రతి ఒక్కరికీ అర్ధం కావాలనే ఉద్దేశంతో ఓ ఇంటర్వ్యూను యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. పదకొండేళ్ల పాటు కలిసి కాపురం చేసిన పవన్ కళ్యాణ్ తనకు తెలియకుండా మరో మహిళతో ఎఫైర్ పెట్టుకొని ఓ బిడ్డను కూడా కన్నారని రేణు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆ కారణంగానే తాము విడాకులు తీసుకున్నట్లు వెల్లడించింది.

పవన్-రేణు విడిపోయే సమయంలో అసలు ఎందుకు విడిపోతున్నారనే విషయం తెలియక చాలా మంది ఆశ్చర్యపోయారు. పవన్ కానీ రేణు కానీ ఈ విషయంపై ఎప్పుడు పెదవి విప్పలేదు. కానీ ఇప్పుడు రేణు రెండో పెళ్లి చేసుకుంటున్న క్రమంలో పవన్ తో ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో బయటకు చెప్పాలనే ఉద్దేశంతో చెప్పుకొచ్చినట్లు స్పష్టం చేసింది. 

loader