పవన్ కళ్యాణ్ తో ఎందుకు విడిపోయారనే విషయంలో ఎప్పుడూ పెదవి విప్పని రేణుదేశాయ్ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ పై సంచనల కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. పవనే తన నుండి విడాకులు కోరుకున్నాడని తన కారణంగానే డివోర్స్ తీసుకున్నట్లు వెల్లడించింది.

పవన్ నుండి విడిపోయిన ఎనిమిది సంవత్సరాల తరువాత ఇప్పుడు మళ్లీ తను పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని చెప్పిన రేణు తన పెళ్లి ఎలా జరగబోతుందనే విషయంలో క్లారిటీ ఇచ్చింది.

''డిసంబర్ నెలలో కోయంబత్తూర్ లో ఇషా సెంటర్ కు సంబంధించిన లింగ భైరవీ ఆలయంలో చాలా సింపుల్ గా మా పెళ్లి జరగబోతుంది. మా పెళ్లి తరువాత కోయంబత్తూర్ లోనే ఓ అనాధాశ్రమంలో అన్నదానం చేస్తాం. గతంలో పవన్ ను పెళ్లి చేసుకున్నప్పుడు గ్రాండ్ మెహందీ ఫంక్షన్ చేయాలనుకున్నాం. కానీ దానికి పవన్ అంగీకరించలేదు. ఈ పెళ్లి ద్వారా నాకున్న చిన్న చిన్న కోరికలు తీర్చుకోబోతున్నాను''అంటూ చెప్పుకొచ్చింది. ఇక తన రెండో భర్త తనతో పాటు ఇద్దరు పిల్లలు యాక్సెప్ట్ చేశారని.. పిల్లలు ఆయనతో చాలా క్లోజ్ అయిపోయినట్లు రేణు తెలిపారు.