పవన్ కి విడాకులు ఇవ్వడానికి అసలు కారణాన్ని రేణుదేశాయ్ బయటపెట్టారు.  ఇన్ని రోజులు కావాలనే రహస్యంగా ఉంచానని ఆమె తెలిపారు

సినీ నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. పవన్ కళ్యాణ్ తాను ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందో.. ఆమె వివరించారు. పవన్ తో విడాకులు తీసుకున్న నాటి నుంచి చాలా సార్లు ఆమెకు ఈ ప్నశ్న ఎదురైనప్పటికీ.. సమాధానం దాటవేస్తూ వచ్చారు. కాగా.. తాజాగా.. ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఆమె తెలియజేశారు. 

తన పర్సనల్‌ యుట్యూబ్‌ చానల్‌లో రిలీజ్‌ చేసిన ఇంటర్య్వూలో ఇన్నేళ్లు ఒంటరిగా సాగిన తన ప్రయాణం, ఎదుర్కొన్న కష్ట నష్టాలతో పాటు పవన్‌తో విడాకులకు కారణమైన పరిణామాలపై స్పందించారు.

విడాకులకు దారి తీసిన పరిస్థితులను వెల్లడించారు. ముందు పవన్‌ కల్యానే విడాకులు కావాలన్నారని, అందుకే విడాకులు తీసుకున్నామని తెలిపారు. తమ ఇంటికి సంబంధించిన విషయాలను బయటకు ఎందుకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఇన్ని రోజులు ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచానని ఆమె తెలిపారు.

ప్రస్తుతం తాను మరొకరిని వివాహం చేసుకోబోతున్నానని.. మరొకరి ఇంటికి కోడలిగా వెళ్లబోతున్నానని.. అందుకే ఈ ప్రశ్నకు వివరణ ఇస్తే బాగుంటుందని అనిపించి ఇప్పుడు చెబుతున్నట్లు రేణు దేశాయ్ తెలిపారు.