పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్ పై మరోసారి సీరియస్ అయ్యారు. ఇటీవలే రేణు స్వయంగా రాసిన ఓ కవితను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ కవిత పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసేలా వుందంటూ పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టారు. అయితే దీనిపై రేణు కూడా గట్టిగా స్పందించింది.

 

సోషల్ మీడియాలో పెట్టిన కవిత పవన్ ను ఎలా టార్గెట్ చేస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పని మీరు చూసుకోవాలని… తన సోషల్ మీడియాలోకి ఎంటరై, ఎదో ఒకటి పోస్ట్ చేస్తూ, తనను కామెంట్ చేయవద్దని అన్నారు. ఈ ట్వీట్ ను కూడా మీరు రాద్ధాంతం చేస్తారనే విషయం తనకు తెలుసని చెప్పారు. మీ వల్లే పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీలకు టార్గెట్ అవుతున్నారని ట్వీట్ చేశారు.


 

సగం నాలెడ్జ్ తో మీరు ట్వీట్లు చేస్తారని… మీరు ఏదో చెబితే, మీడియా దాన్ని పూర్తిగా హైలైట్ చేస్తోందని విమర్శించారు. దయచేసిన తమరి పని తమరు చేసుకోవాలని… పవన్ గురించి ఎలాంటి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని కోరారు. గ‌తంతో కూడా ప‌వ‌న్ అభిమానులు రేణూపై విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో అవి పెద్ద దుమారాన్నే లేపాయి. తాజాగా మ‌రోసారి రేణూను టార్గెట్ చేశారు ప‌వ‌న్ అభిమానులు. అంతే రీతిలో ఘాటుగా రిప్లై ఇచ్చింది రేణు దేశాయ్.