నిరాడంబరంగా రేణుదేశాయ్ నిశ్చితార్ధం .. పెళ్లికొడుకు ఎవరో సస్పెన్స్

Renu Desai Engagement Pic
Highlights

నిరాడంబరంగా రేణుదేశాయ్ నిశ్చితార్ధం .. పెళ్లికొడుకు ఎవరో సస్పెన్స్ 

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో విడిపోయాకా.. తన ఇద్దరు పిల్లలతో కలిసి పుణేలో ఉంటూ.. వారికే తన జీవితాన్ని అంకితం చేసిన రేణూ దేశాయ్ సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లుగా గత కొద్దిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. నాకో తోడు దొరికిందంటూ ఆమె ఓ వ్యక్తి చేయిపట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడం.. తనకు కాబోయే భర్త చేస్తున్న మెసేజ్‌లను నా స్నేహితులు చదవనివ్వడం లేదంటూ పోస్ట్ చేయడంతో.. రేణూ దేశాయ్ ద్వితీయ వివాహం చేసుకోబోతున్నారనే వార్తలకు బలం చేకూరినట్లయ్యింది.

ఈ నేపథ్యంలో ఆమె నిశ్చితార్ధం జరిగింది.. ఈ సందర్భంగా ఉంగరాలు మార్చుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానితో పాటుగా బాధ నుంచి కోలుకునేందుకు నాకు సహాయంగా  నిలిచినందుకు నీ నిజాయితీ మనసుకు ధన్యవాదాలు అని రాశారు. అయితే తనకు కాబోయే భర్త ఎవరో మాత్రం రేణుదేశాయ్ చెప్పలేదు. కనీసం అతడి పేరు కూడా వెల్లడించలేదు. 

loader