పవన్ కొడుకు హైట్ చూశారా..? తండ్రినే మించిపోయాడు

renu desai comments on akira nandan's height
Highlights

 'అకీరా నాకంటే హైట్.. నా ఎత్తు 5'8 కాగా, అకీరా ఎత్తు ఆరు అడుగుల మూడు అంగుళాలు' అంటూ చెప్పుకొచ్చింది. 

రెండేళ్ల క్రితం వరకు కూడా చాలా అమాయకంగా చిన్నవాడిలా కనిపించే పవన్-రేణుదేశాయ్ ల కొడుకు అకీరా నందన్ ఇప్పుడు మాత్రం చాలా ఎదిగిపోయాడు. ఈ రెండేళ్లలో అతడి ఎదుగుదల ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

తండ్రి పవన్ కళ్యాణ్ ఎత్తుని మించిపోయాడు. ఈ విషయాన్ని అతడి తల్లి రేణు దేశాయ్ వెల్లడించింది. 'అకీరా నాకంటే హైట్.. నా ఎత్తు 5'8 కాగా, అకీరా ఎత్తు ఆరు అడుగుల మూడు అంగుళాలు' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన ఇద్దరి పిల్లలతో కలిసి ఫారెన్ వెకేషన్ కు వెళ్లిన రేణుదేశాయ్ అక్కడ జాలీగా గడుపుతున్నారు. అకీరా 14 ఏళ్లకే ఆరు అడుగులు ఎదిగిపోయాడు.. తను ఎంత ఎత్తు ఎదిగినా ఎప్పటికీ నా బేబీనే అంటూ కొడుకుపై తన ప్రేమను చాటుకుంది.

పవన్ నుండి విడిపోయిన రేణు త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుంది. కొద్దిరోజుల క్రితం నిశ్చితార్ధం చేసుకున్న రేణు ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోనుంది. 
 

loader