‘‘నాకు కాబోయే భర్తను చంపేస్తామన్నారు’’..రేణు

First Published 7, Jul 2018, 3:31 PM IST
renu desai about her hubby
Highlights

తన జీవితం గురించి మరిన్ని విషయాలను రేణు నెటిజన్లతో పంచుకున్నారు.ఇటీవల రేణుదేశాయ్ ఎంగేజ్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. తనకు కాబోయే వ్యక్తి ఫోటోని మాత్రం ఆమె రివీల్ చేయలేదు. ఆ వ్యక్తి ఎవరో చెప్పాలంటూ రేణుని చాలా మంది ప్రశ్నించినా.. ఆమె దానికి సమాధానం చెప్పలేదు. 

సినీ నటి, పవన్ కళ్యాన్ మాజీ భార్య రేణు దేశాయ్.. త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. ఓ కొత్త వ్యక్తితో తన నూతన జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలను నెటిజన్లతో పంచుకున్నారు. 

ఇటీవల రేణుదేశాయ్ ఎంగేజ్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. తనకు కాబోయే వ్యక్తి ఫోటోని మాత్రం ఆమె రివీల్ చేయలేదు. ఆ వ్యక్తి ఎవరో చెప్పాలంటూ రేణుని చాలా మంది ప్రశ్నించినా.. ఆమె దానికి సమాధానం చెప్పలేదు. కానీ.. తాజాగా తాను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో రేణు దేశాయ్ వివరించారు.

‘‘గతేడాది నేను మళ్లీ పెళ్లి గురించిన ఆలోచనను వ్యక్తం చేశాను. పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను అనగానే చాలా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ‘నిన్ను, నీ కాబోయే భర్తను చంపేస్తాం’ అంటూ సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియాలోని కామెంట్స్‌ను పట్టించుకోవలసిన అవసరం లేదని చాలామంది చెప్పారు. కానీ అలా పట్టించుకోకుండా నేను ఉండలేకపోయాను. నాకు కాబోయే భర్తకు హాని కలగకూడదనే ఆయన ఎవరనేది నేను చెప్పలేదు. చిత్రపరిశ్రమకి సంబంధించిన వ్యక్తి మాత్రం కాదు .. పెళ్లి తరువాత ఆయన ఎవరనేది చెబుతాను’’ అని రేణు వెల్లడించారు.

loader