'కాలా'కు కావేరి సెగ!

release problems for kaala movie in karnataka
Highlights

రజినీకాంత్ నటించిన 'కాలా' సినిమా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాను 

రజినీకాంత్ నటించిన 'కాలా' సినిమా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాను తమ రాష్ట్రంలో విడుదల కానివ్వమని కన్నడ సంఘాలు ప్రకటించాయి. కొద్దిరోజుల క్రితం కావేరీ జలాల వివాదానికి సంబంధించి రజినీకాంత్ తమిళనాడు ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడారు.

ఈ మాటలు కన్నడిగులకు ఆగ్రహం తెప్పించాయి. కన్నడిగుడైన రజినీకాంత్ తన సొంత రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడడం తట్టుకోలేని నేతలు ఆయన సినిమాను కన్నడలో విడుదల కానివ్వమని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కర్ణాటకలో 'కాలా' రిలీజ్ అవుతుందా..? లేదా..? అనే ఉత్కంఠ నెలకొంది. గతంలో సత్యరాజ్ కూడా కన్నడ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడారని ఆయన నటించిన 'బాహుబలి ది కంక్లూజన్' సినిమా కన్నడలో విడుదల కాకుండా అడ్డు తగిలారు. దీంతో సత్యరాజ్ స్వయంగా కన్నడిగులకు క్షమాపణలు చెప్పి సినిమాను రిలీజ్ చేయించుకున్నారు. మరి ఇప్పుడు రజినీకాంత్ ఏం చేస్తారో చూడాలి!

loader