రెజీనాకు పోలీసుల సీరియస్ వార్నింగ్!

Regina Cassandra joins 'Kiki challenge'
Highlights

ఇక తాజాగా రెజీనా ఈ ఛాలెంజ్ ను స్వీకరించి కదులుతున్న కారులో నుండి దిగి డాన్స్ చేసింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. అయితే ముంబై పోలీసులు మాత్రం ఈ ఛాలెంజ్ పై ఆగ్రహంగా ఉన్నారు

ఇటీవలి కాలంలో రాజకీయనాయకులు, సెలబ్రిటీలు పలు ఛాలెంజ్ లను విసురుతూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఫిట్ నెస్ ఛాలెంజ్, గ్రీన్ ఛాలెంజ్ ఈ జాబితాలోకి వస్తాయి. తాజాగా ఫేమస్ సింగర్ డ్రేక్ పాడిన 'ఇన్ మై ఫీలింగ్స్' పాట బాగా పాపులర్ అవడంతో హాలీవుడ్ నటుడు షిగ్గి 'కికి ఛాలెంజ్' పేరుతో సోషల్ మీడియాలో ఛాలెంజ్ ను ప్రారంభించారు. దీనికి అంతర్జాతీయ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నారు. ఈ ఛాలెంజ్ ప్రకారం కదులుతున్న కారు నుండి కిందకి దిగి కారు నిదానముగా కదులుతుండగా దానితో పాటు డాన్స్ చేసి మళ్ళీ కారులోకి రావాలి. ఇటీవల ఆదాశర్మ ఈ ఛాలెంజ్ ను స్వీకరించింది. అయితే ఆమె ఆగి ఉన్న కారు పక్కన నిలుచొని డాన్స్ చేసింది. ఇక తాజాగా రెజీనా ఈ ఛాలెంజ్ ను స్వీకరించి కదులుతున్న కారులో నుండి దిగి డాన్స్ చేసింది.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. అయితే ముంబై పోలీసులు మాత్రం ఈ ఛాలెంజ్ పై ఆగ్రహంగా ఉన్నారు. నడుస్తున్న కారు నుండి దిగి డాన్స్ చేయడం ప్రమాదకరమని, మీ వల్ల ఇతరుల ప్రాణాలకు కూడా హాని కలిగే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. సెలబ్రిటీలు చేసే పనులను ప్రజలు ఎక్కువగా ఫాలో అవుతుంటారు కాబట్టి ఇలాంటివి చేయకపోవడమే బెటర్ అని హెచ్చరించారు. 

 

 

loader