బాలీవుడ్ చిత్రంలో ఆంఖే2 లో రెజీనాకు అవకాశం భారీ హంగామాతో ప్రారంభించిన యూనిట్ ప్రస్థుతం షూటింగ్ నిలిచిపోయి సందిగ్దంలో ఆంఖే2
అందం, అభినయం రెండూ కలగలిపిన హీరోయిన్స్ లో రెజీనా కసాండ్రా కూడా ఉంటుంది. అయితే కేరీర్ ప్రారంభమై ఇన్నేళ్లయినా ఆమె టాలెంటుకు, అందానికి తగ్గ అవకాశాలు మాత్రం దక్కలేదనే చెప్పాలి. తెలుగులో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ డమ్ పెంచుకుంటున్న టైంలో వరుస ఫ్లాపులు ఆమెను అమాంతం కింద పడేశాయి. అయితే అదే సమయంలో కొన్ని తమిళ అవకాశాలు రావడంతో తమిళ ఇండస్ట్రీలోకి వెళ్లి ఈ చెన్నై చిన్నది కాస్త రిలాక్స్ అయింది.
కెరీర్ ట్రాక్ పై ఉండగానే క్రితం ఏడాది ఆమెకు ఓ బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కింది. అదే.. ఆంఖే-2. అనీస్ బజ్మి దర్శకత్వంలో విపుల్ షా నిర్మించ తలపెట్టిన సినిమా ఇది. ఈ సినిమాకు కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని గత ఏడాది ఓ రేంజిలో చేశారు. ఆ వేడుక కోసం రెజీనా చాలా సెక్సీగా తయారై రావడం.. స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుండగా.. ఆమె డ్రెస్ కాస్త ఊప్స్ మూమెంట్ క్రియేట్ చేయడంతో అదో హాట్ టాపిక్ కావడం మీకంతా గుర్తుండే ఉంటుంది. ఆ దెబ్బతో బాలీవుడ్లో రెజీనా పేరు బాగానే చర్చనీయాంశమైంది.
అయితే ఇంత హంగామా చేసి మొదలుపెట్టిన సినిమా ఇప్పుడు ఆగిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి. కారణాలేంటో తెలియలేదు కానీ.. ‘ఆంఖే-2’ అస్సలు ముందుకు కదలట్లేదట. కొంత భాగం షూటింగ్ చేసి మధ్యలోనే ఆపేసినట్లు తెలుస్తోంది.
రెజీనా ఇంకా ఈ సినిమా షూటింగ్‌లో కూాడా పాల్గొనలేదట. మొత్తానికి ఓ క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్టులో అవకాశం దక్కినట్లే దక్కి చేజారిపోయింది రెజీనాకు. దీంతో ఆమె బాలీవుడ్ కలలకు బ్రేక్ పడినట్లే అయింది. ఇక తెలుగు తమిళ భాషల్లో కూాడా పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో రెజీనా కెరీర్ పై అనుమానాలు తలెత్తుతున్నాయి
