Asianet News TeluguAsianet News Telugu

‘అర్జున్ రెడ్డి’ ని మిస్ అయ్యానంటున్న శర్వానంద్

  • విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘ అర్జున్ రెడ్డి’
  • భారీ విజయం సొంతం చేసుకున్న అర్జున్ రెడ్డి
  • అర్జున్ రెడ్డిలో నటించే అవకాశాన్ని వదులుకున్న శర్వానంద్
Reason Behind Sharwanand Rejected Arjun Reddy Movie

విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా నటించిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ఇటీవల విడుదలైన ఈ సినిమా భారీ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం రూ.4కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.40కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తప్ప మరెవరూ నటించలేరు అన్నంతగా నటించి మెప్పించాడు. అయితే.. ఈ సినిమా కథ మొదట శర్వానంద్ దగ్గరకు వెళ్లిందట.  

 

సందీప్ వంగ ఈ సినిమాను ముందు శర్వానంద్ కే వినిపించాడట. కథ నచ్చి అశ్వనిదత్, లగడపాటి శ్రీధర్ లాంటి వారికి వినిపిస్తే.. వారు నిర్మాతలుగా వ్యవహరించేందుకు ఆసక్తి చూపలేదట. దీంతో సినిమాను సందీప్ వంగనే తన సొంతంగా నిర్మించాడు.  నిర్మాతలు ఓకే అంటే కచ్చితంగా ఆ సినిమా తానే తీసి ఉండేవాడినని,  అలా అర్జున్ రెడ్డిని మిస్ అయ్యానని అంటున్నాడు శర్వానంద్.

 

అర్జున్ రెడ్డి శర్వానంద్ చేస్తే ఎలా ఉండేదో తెలియదు కాని విజయ్ దేవరకొండ మాత్రం అదరగొట్టాడు. సినిమాతో తన సత్తా చాటిన విజయ్ ఈ దెబ్బతో స్టార్ హీరో అయ్యాడని చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి  సినిమా ఈ రేంజ్ హిట్ అవుతుందని శర్వానంద్ కు  ముందే తెలిస్తే... వదులుకునేవాడు కాదేమో అందుకే తన తదుపరి చిత్రమైనా సందీప్ వంగతో చేయాలని ప్రణాళికలు చేస్తున్నాడట శర్వానంద్

Follow Us:
Download App:
  • android
  • ios