అన్నయ్య కంటే యాడ్ ఫిలిం ఎక్కువయిపోయిందా తారక్.?

అన్నయ్య కంటే యాడ్ ఫిలిం ఎక్కువయిపోయిందా తారక్.?

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ ఐపిఎల్ యాడ్స్ షూటింగ్ కోసం హైదరాబాద్ నగర శివార్లలో బిజీ గా ఉన్న విషయం బయటికి లీక్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 7న సీజన్ 11 ప్రారంభం కానున్న నేపధ్యంలో ఇది మరో రెండు మూడు రోజుల్లోనే టెలికాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అసలు తన లుక్ బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్న తారక్ ఇప్పుడు మాత్రం దీనికి ఎలా ఒప్పుకున్నాడా అనే అనుమానం రాకమానదు. ఎమ్యెల్యే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు జూనియర్ ఎందుకు రాలేదు అని కళ్యాణ్ రామ్ ను అడిగినప్పుడు కొత్త సినిమా కోసం రెడీ చేసుకున్న లుక్ బయటికి రాకూడదు అనే ఉద్దేశంతోనే ఇద్దరం మాట్లాడుకుని డ్రాప్ అయ్యామని స్వయంగా చెప్పాడు. మరి ఇప్పుడు ఐపిఎల్ యాడ్ కోసం తారక్ లుక్ లో కనిపించడం కాదు ఏకంగా నటిస్తున్నాడు. మరి ఇప్పుడు లుక్ సంగతి ఏంటి అనేదే భేతాళ ప్రశ్న.

కళ్యాణ్ రామ్ చెప్పింది నిజమని కాసేపు అనుకుందాం. అలాంటప్పుడు మరో మూడు నాలుగు నెలల దాకా తారక్ బయట కనిపించనేకూడదు. ఎమ్యెల్యే విడుదలై ఇంకా వారం కూడా కాలేదు. ఆ వేడుకకు రాని యంగ్ టైగర్ ఐపిఎల్ షూట్ కోసం రెడీ అయ్యాడు అంటే అనుమానం రాక మానదు. కాని తారక్ వర్గీయుల మాట వేరుగా ఉంది. లుక్ బయటికి రాకూడదని ఎమెల్యే ఆడియో స్కిప్ చేయలేదని - కేవలం రాజకీయ వాతావరణం వేడిగా ఉన్న ఈ సమయంలో ఆ ప్రశ్నలు ఎదురుకునే అవకాశం ఉండటం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో వద్దు అనుకున్నట్టు చెబుతున్నారు. ఇందులో ఏదో నిజమో ఏదో అబద్దమో కాని మొత్తానికి తారక్ కొత్త చర్చకు అవకాశం ఇచ్చాడు. త్రివిక్రమ్ సినిమాకు ఏ లుక్ లో ఉంటాడు అనేది పూర్తిగా ఐపిఎల్ యాడ్స్ లో బయట పడనుంది. ఆ విషయంలో సస్పెన్స్ కు తెరపడినట్టే. ఇదలా ఉంచితే ఎన్టీఆర్ మాత్రం కొత్త లుక్ లో యమదొంగ - కంత్రి రోజుల్ని గుర్తుకు తెస్తున్నాడు. సన్నబడిన ఎన్టీఆర్ పిక్స్ చూసి ఫాన్స్ మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page