హీరోలు తమ సినిమాల్లో హీరోయిన్లుగా కొందరిని సజెస్ట్ చేయడం కామన్ గా జరుగుతుంటుంది. కథకు వారు సెట్ అయితే గనుక దర్శకనిర్మాతలు కూడా వారినే ఫైనల్ చేస్తుంటారు. మాస్ మహారాజా రవితేజ కూడా 'నేల టికెట్టు' సినిమా ద్వారా మాళవిక శర్మ అనే అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేశాడు. నిజానికి ఆమెను సినిమాలో హీరోయిన్ గా తీసుకోమని చెప్పింది కూడా రవితేజ అని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ స్వయంగా వెల్లడించారు.

అయితే ఈ సినిమా కాస్త ఫ్లాప్ కావడంతో మాళవికకు టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. దీంతో మరోసారి తన సినిమాలో మాళవికకు ఛాన్స్ ఇచ్చి ఆమెకు టాలీవుడ్ లో బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట రవితేజ. ఒకసారి ఫ్లాప్ ఇచ్చిన హీరోయిన్ కు మళ్లీ ఛాన్స్ ఇస్తుండడంతో  రవితేజకు ఆమెపై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందనే వార్తలు ఊపందుకున్నాయి. దర్శకుడు వి.ఐ. ఆనంద్ తో చేయబోయే సినిమాలో మాళవికను హీరోయిన్ గా తీసుకోమని రవితేజ సజెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. 

ఇటువంటి వివాదాలకు దూరంగా ఉండే రవితేజ ఓ యువనటిని ప్రత్యేకంగా రికమండ్ చేస్తుండడంతో టాలీవుడ్ లో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే మాటలు జోరుగా వినిపిస్తున్నాయి.