దాదాపు రెండేళ్ల పాటు రవితేజ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. సుదీర్ఘ విరామం తరువాత 'రాజా ది గ్రేట్' సినిమాలో నటించి సక్సెస్ అందుకున్నాడు. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో మాస్ మాహారాజ మరోసారి తన సత్తా చాటాడు. ప్రస్తుతం రవితేజ 'టచ్ చేసి చూడు' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవనుంది. ఈ సినిమా తరువాత రవితేజ ఎవరితో సినిమా చేయబోతున్నాడనే విషయంలో ఇటీవల చాలా వార్తలు వినిపించాయి. ముందుగా రవితేజతో సినిమా చేయాలని శ్రీనువైట్ల ఎదురుచూస్తున్నాడు. నిర్మాతలను సెట్ చేసుకున్నాడు. అమెరికాలో ఎక్కువ భాగం షూటింగ్ ఉండడంతో అక్కడకి వెళ్ళి లొకేషన్స్ కూడా ఫైనల్ చేసుకొని వచ్చాడు. అయితే సీన్లోకి దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఎంట్రీ ఇచ్చాడు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా ఒక కథను సిద్ధం చేసుకొని అతడికి వినిపించాడు. 

కథ విని ఇంప్రెస్ అయిన రవితేజ సినిమా చేయడానికి అంగీకరించాడు. దీంతో రవితేజ ముందుగా కల్యాణ్ సినిమా పూర్తి చేస్తాడని ఆ తరువాతే శ్రీనువైట్లతో సినిమా ఉంటుందనే మాటలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం రవితేజ ముందుగా వైట్ల సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో సినిమా మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా పూర్తయిన తరువాత కల్యాణ్ కృష్ణ సినిమా మొదలవుతుందని సమాచారం. సో.. అప్పటివరకు కల్యాణ్ కృష్ణకు వెయిటింగ్ తప్పదన్నమాట. మరి ఈలోగా కల్యాణ్ కృష్ణ మరో సినిమా పూర్తి చేస్తాడో.. లేక రవితేజ కోసం ఎదురుచూస్తాడో.. చూడాలి!