ఇటీవల రాజా ది గ్రేట్ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కిన మాస్ రాజా ‘టచ్ చేసి చూడు’ తొలిరోజు కలెక్షన్స్‌‌లో పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. భారీ అంచనాలతో శుక్రవారం నాడు థియేటర్స్‌కి వచ్చిన ఈ మూవీ తొలి ఆట నుండి నెగిటివ్ టాక్ రావడంతో ఈ ప్రభావం కలెక్షన్స్‌పై పడింది. మాస్ రాజా మూసకథ మాస్ ఆడియన్స్‌కి తప్ప.. కామన్ ఆడియన్స్‌ని మెప్పించలేకపోయింది.
 

ఓవర్సీస్‌లో బిజినెస్‌‌లో ‘టచ్ చేసి చూడు’ వెనకబడిపోవడం, ప్రమోషన్స్ అంతంత మాత్రంగానే ఉండటంతో పాటు టీజర్, ట్రైలర్‌లు సైతం రొటీన్‌గానే ఉండటం తొలిరోజు కలెక్షన్స్‌పై ప్రభావం చూపించింది. రవితేజ గత చిత్రం ‘రాజా ది గ్రేట్’ తొలిరోజు కలెక్షన్స్‌‌లో దుమ్ములేపగా.. ‘టచ్ చేసి చూడు’ ఆ స్థాయి కలెక్షన్స్ సాధించలేకపోయింది. ‘రాజా ది గ్రేట్’ తొలిరోజు రూ.4.9 కోట్ల షేర్‌ని అందుకొని రవితేజ కెరియర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్‌ మార్క్‌ని చేరుకోగా.. ‘టచ్ చేసి చూడు’రూ.3 కోట్ల దగ్గరే ఆగిపోయినట్లు ట్రేడ్ విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు. అయితే ‘టచ్ చేసి చూడు’ తొలిరోజు కలెక్షన్స్‌పై ఇంత వరకూ అధికారిక సమాచారాన్ని విడుదల చేయలేదు చిత్ర యూనిట్. ఈ మూవీలో మాస్ ఆడియన్స్‌ ఆకట్టుకునే సీన్స్ పుష్కలంగా ఉండటంతో శని, ఆదివారాల్లో కలెక్షన్స్ పెరగవచ్చని నిర్మాతలు భావిస్తున్నారు.రాశీఖన్నా, సీరత్ కపూర్‌లు హీరోయిన్లుగా నటించగా... కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ ‘టచ్ చేసి చూడు’ మూవీతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ కథను అందించారు.

 

టచ్ చేసి చూడు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్.. ఏపీ తెలంగాణ మొదటిరోజు..

నైజాం-1.56
సీడెడ్-0.47
నెల్లూరు-0.20
గుంటూరు-0.47
క్రిష్ణా-0.23
వెస్ట్-0.30
ఈస్ట్.45
యూఏఈ-0.48

ఏపీ తెలంగాణ షేర్ మొత్తం - 4.16 Crs