ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ‘జై లవ కుశ’ చిత్రానికి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీంతో సినిమా ప్రమోషన్ల పనుల్లో ఆయన బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ పనులు పూర్తైన తర్వాత ఆయన ఎమ్మెల్యే(మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి) చిత్ర షూటింగ్ లో పాల్లొంటారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కాజల్ నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో లక్ష్మి కళ్యాణం వచ్చింది.

 

ఆ సినిమా అనంతరం కళ్యాణ్ రామ్.. తన తదుపరి చిత్రం రవికుమార్ చౌదరితో చేయనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఎప్పుడో సినిమా రావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల రాలేదు. సాయిధరమ్ తేజ్ కి హిట్ టాక్ తీసుకువచ్చిన పిల్లా నువ్వులేని జీవితం సినిమా మొదట కళ్యాణ్ రామ్ కే అనున్నారట. కానీ.. ఏవో కారణాల వల్ల ఆయన చేయలేకపోయారట. దీంతో ఆ అవకాశం సాయి ధరమ్ తేజ్ కి దక్కింది.

 

అయితే.. ఈ సారి మాత్రం కచ్చితంగా వారి కాంబినేషన్లో సినిమా చేయాలని కళ్యాణ్ రామ్, రవికుమార్ భావించారట. త్వరలోనే పట్టాలెక్కునున్న ఈ చిత్రాన్ని రుగ్వేద క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కించనున్నారు.