తెలుగులో నాగార్జున, మోహాన్ బాబు, బాలకృష్ణ లాంటి హీరోల సరసన నటించిన బాలీవుడ్ అలనాటి అందాల తార రవీనాటాండన్ రీసెంట్ గా బాహుబలి హీరోలు ప్రభాస్, రానా దగ్గుబాటితో దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దసరా రోజున హైదరాబాద్ లో జరిగిన ఓ పార్టీలో ప్రభాస్, రానా, అనుష్క, రవీనా టాండన్ కలుసుకున్నారు.

 

 

#aboutlastnight✨ #partyinghyderabadstyle #fun #food #friends #thebahubaliway

A post shared by Raveena Tandon (@officialraveenatandon) on Sep 30, 2017 at 9:36pm PDT

పార్టీలో సరదాగా ఎంజాయ్ చేసిన బాహుబలి టీమ్,రవీనా అంతా కలిసి సెల్ఫీ దిగారు. ఆ ఫోటోను రవీనా తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. తను షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఆ ఫోటో వైరల్‌గా మారింది. ఈ పార్టీ సందర్భంగా బాహుబలితో జాతీయ స్థాయి ప్రజాదరణను పొందిన ప్రభాస్, అనుష్కకు రవీనా టాండన్ కత్తిని బహుకరించింది.

 

ఈ పార్టీలో బాహుబలి నటీనటులతో రవీనా చాలా సమయాన్ని గడిపినట్టు తెలుస్తున్నది. అయితే ఈ పార్టీ ఎక్కడ, ఎందుకు జరిగిందనే విషయంపై వివరాలు అందుబాటులోకి రాలేదు. బాహుబలి సృష్టించిన ప్రభంజనంతో నేషనల్ లెవెల్లో ప్రభాస్, రానా, అనుష్కకు మంచి పేరొచ్చింది. వీళ్ల నటనకు బాలీవుడ్ కూడా ఫిదా కావడం విశేషం.