కన్నడ హీరోయిన్ రష్మిక మందనా.. 'ఛలో' చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని పలు ఆఫర్లు చేజిక్కించుకున్న ఈ బ్యూటీ కన్నడలో తన కో స్టార్ గా నటించిన రక్షిత్ శెట్టిని ప్రేమించి నిశ్చితార్ధం కూడా చేసుకుంది. త్వరలోనే పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ జంట విడిపోయే స్టేజ్ కు వచ్చిందని కన్నడ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఎంగేజ్మెంట్ జరిగే సమయానికి తెలుగులో రష్మికకు అంత క్రేజ్ లేదు.

కానీ ఇప్పుడు ఆమెకు మంచి గుర్తింపు లభించింది. టాప్ ప్రొడక్షన్స్ తో కలిసి పని చేసే ఛాన్స్ వస్తోంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న ఈ సమయంలో పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమవ్వడం తనకు ఇష్టం లేదట. ఈ కారణంతోనే తన రిలేషన్షిప్ కి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుందట. ప్రస్తుతం సినిమాల మీదే దృష్టి పెట్టాలని, పెళ్లి ఆలోచనే మానుకోవాలని అనుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. రక్షిత్ శెట్టి తనకు ఫోన్ చేస్తున్నా.. ఆమె స్పందించడం లేదని తెలుస్తోంది. ఇక త్వరలోనే తన బ్రేకప్ సంగతి చెప్పే అవకాశం కూడా ఉంది.

కానీ ఆమె మేనేజర్ మాత్రం ఈ విషయంలో నిజం లేదని వాళ్లిద్దరూ కలిసే ఉన్నారని ఈ వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రష్మిక నటించిన 'గీత గోవిందం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలానే నాగ్-నాని మల్టీస్టారర్ లో హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ దేవరకొండతో 'కామ్రేడ్' అనే మరో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమ్మడు జోరు చూస్తుంటే.. స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఛాన్సులు దక్కించుకునేలా ఉంది.