రష్మిక మందన్నా మొన్నటి వరకు తన జోరు చూపించింది. ఇప్పుడు కాస్త స్లో అయ్యింది. ఈ క్రమంలో తన లేడీ ఓరియెంటెడ్‌ మూవీ `ది గర్ల్ ఫ్రెండ్‌`ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది. 

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా మొన్నటి వరకు తన హవా చూపించింది. బ్యాక్‌ టూ బ్యాక్‌ భారీ సినిమాల్లో భాగమైంది. `యానిమల్‌` నుంచి ఆమె జోరు సాగిందని చెప్పొచ్చు. `పుష్ప2`, `ఛావా` వంటి చిత్రాలతో అలరించింది. బాక్సాఫీసుని షేక్‌ చేసింది.

చివరగా సల్మాన్‌ ఖాన్‌తో `సికందర్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఇది నిరాశ పరిచింది. ఇక ఇటీవలే నాగార్జున, ధనుష్‌ కలిసి నటించిన `కుబేర` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ యావరేజ్‌గా ఆడింది. కానీ నటిగా ఆమెకి మంచి ప్రశంసలే దక్కాయి. 

లేడీ ఓరియెంటెడ్‌ మూవీ `ది గర్ల్ ఫ్రెండ్‌`తో రాబోతున్న రష్మిక

ఇక ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ లతో సందడి చేయబోతుంది. అందులో భాగంగా లేడీ ఓరియెంటెడ్‌ మూవీ చేస్తుంది. అదే `ది గర్ల్ ఫ్రెండ్‌`. `ఆడవాళ్లు మీకు జోహార్లు` తర్వాత రష్మిక చేస్తున్న లేడీ ఓరియెంటెడ్‌ మూవీ ఇది. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ మూవీ ఎప్పుడో ప్రారంభమైంది. కానీ అనేక కారణాలతో షూటింగ్‌ డిలే అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిత్రీకరణ పూర్తి చేసే పనిలో టీమ్‌ ఉంది. తాజాగా సినిమా ఫైనల్‌ షెడ్యూల్‌ పూర్తి చేసే పనిలో ఉందట.

`ది గర్ల్ ఫ్రెండ్‌` మూవీ చివరి షెడ్యూల్‌ షూటింగ్‌

`ది గర్ల్ ఫ్రెండ్‌` టీమ్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. `రష్మిక సరసన  హీరో దీక్షిత్ శెట్టి నటిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది.

`ది గర్ల్ ఫ్రెండ్‌` రిలీజ్‌ డేట్‌ త్వరలో

ప్రస్తుతం హైదరాబాద్ లో రష్మిక, దీక్షిత్ శెట్టిపై పాట చిత్రీకరిస్తున్నారు. టాకీ పార్ట్ దాదాపుగా పూర్తయ్యింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను  అనౌన్స్ చేయనున్నాం` అని టీమ్‌ తెలిపింది. 

ఈ చిత్రంలోని పాటను ఈ నెలలోనే విడుదల చేయనున్నారట. `ది గర్ల్ ఫ్రెండ్‌` చిత్రానికి హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ సంగీతం అందిస్తుండగా, కృష్ణన్‌ వసంత్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

రష్మిక మందన్నా కొత్త సినిమాలివే

దీంతోపాటు రష్మిక మందన్నా ప్రస్తుతం మరో లేడీ ఓరియెంటెడ్‌ మూవీ `మైసా`లో నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీని ప్రకటించారు. ఇందులో కత్తి పట్టి వీరనారీగా రష్మిక కనిపించిన తీరు వాహ్‌ అనిపించింది.

 జస్ట్ పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలను పెంచుతుంది. మరోవైపు హిందీలో షాహిద్‌ కపూర్, కృతి సనన్‌లతో కలిసి `కాక్‌టెయిల్‌2`లో నటిస్తుంది రష్మిక. అలాగే `తమా` అనే మరో హిందీ మూవీలో నటిస్తూ బిజీగా ఉంది. 

అయితే భారీ బడ్జెట్‌ చిత్రాలు లేకపోవడం గమనార్హం. కాకపోతే ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో రష్మిక చాలా సెలక్టీవ్‌గా ఉంటుందని టాక్‌.