రక్షిత్ శెట్టి, విజయ్ దేవరకొండలలో నాకు ఇష్టమైంది ఎవరంటే.. రష్మిక కామెంట్స్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 18, Aug 2018, 5:12 PM IST
rashmika mandanna about her co actors
Highlights

'కిరిక్ పార్టీ' చిత్రంతో కన్నడలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక 'ఛలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది

'కిరిక్ పార్టీ' చిత్రంతో కన్నడలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక 'ఛలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా ఆమెకు మరిన్ని అవకాశాలు తీసుకొచ్చింది. రీసెంట్ గా విజయ్ దేవరకొండతో కలిసి ఆమె నటించిన 'గీత గోవిందం' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. గీత పాత్రలో రష్మిక నటనను కొనియాడుతున్నారు.

నటిగా ఆమె నటించింది ఐదు చిత్రాల్లోనే.. ఆ ఐదు కూడా మంచి విజయాలు అందుకున్నాయి. తన సినిమాల్లో నటించే హీరోలు తనకు ఎన్నో సలహాలు, సూచనలు అందించారని రష్మిక వెల్లడించింది. ''రక్షిత్ శెట్టి, పునీత్ రాజ్ కుమార్, గణేష్, నాగశౌర్య, విజయ్ దేవరకొండలతో ఇప్పటివరకు కలిసి పని చేశాను. తదుపరి సినిమాలో నానితో జతకడుతున్నాను. ఈ ఐదుగురులో నాకు నచ్చిన హీరో ఎవరంటే చెప్పడం మాత్రం చాలా కష్టం.

నాకు ప్రతీ ఒక్కరితో మంచి బంధం ఉంది. వారి నుండి చాలా నేర్చుకున్నాను. వీరిలో ఇష్టమైన ఒకరి పేరు మాత్రం చెప్పలేను. ఎందుకంటే నా కెరీర్ ఇలా ఉండడానికి వారి సహకారం చాలా ఉంది'' అంటూ చెప్పుకొచ్చింది. ఇక రష్మికకు మేకప్ వేసుకోవడం పెద్దగా నచ్చదట. లక్కీగా తన తదుపరి సినిమా 'డియర్ కామ్రేడ్' లో మేకప్ లేకుండా నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.    

ఇది కూడా చదవండి.. 

ఇప్పట్లో పెళ్లి లేదు.. పుకార్లపై రష్మిక స్పందన!

loader