హీరోయిన్ రష్మిక కన్నడ నటుడు రక్షిత్ శెట్టిని ప్రేమించి నిశ్చితార్ధం కూడా చేసుకుంది. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అయితే తెలుగులో ఆమె హీరోయిన్ గా బిజీ అయిపోవడంతో పెళ్లి ఆలోచన పక్కన పెట్టేసినట్లు, ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుందని వార్తలు వినిపించాయి. ఈ విషయంపై స్పందించిన రష్మిక ఇప్పట్లో పెళ్లి లేదని క్లారిటీ ఇచ్చేసింది.

''రక్షిత్ కి నాకు మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. ఎలాంటి వార్తలు వచ్చినా మేం పట్టించుకోమ్. రక్షిత్ తో బ్రేకప్ అంటూ వార్తలు వచ్చినప్పుడు ఒక్కసారి గట్టిగా నవ్వుకున్నాను. ఇద్దరం ప్రేమించుకోవడం ఎంగేజ్మెంట్ హడావిడిగా జరిగిపోయాయి. అందుకే ఇప్పుడు అతడితో డేటింగ్ చేస్తున్నాను. ఆ తరువాత పెళ్లి చేసుకుంటాను. పెళ్లి ఎప్పుడు అనే విషయం మాత్రం ఇంకా తెలియదు'' అంటూ తన రిలేషన్షిప్ మీద వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చేసింది ఈ బ్యూటీ.

ఇక సోషల్ మీడియాలో ఆమెపై జరుగుతోన్న ట్రోలింగ్ పై స్పందించింది. ''చాలా మంది హీరోయిన్లు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కొన్ని కామెంట్స్ నేను చూస్తాను. కొన్ని స్నేహితుల ద్వారా తెలుస్తుంటాయి. కానీ నేను వేటినీ పట్టించుకోను. వ్యక్తిగత విషయాలను సినిమాలతో ముడిపెట్టను. ప్రేక్షకులు కూడా అలా చూడొద్దని కోరుకుంటున్నాను'' అని వెల్లడించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మరో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. అలానే ఓ కన్నడ సినిమాలో కూడా నటించనుంది. 

రష్మిక లేటెస్ట్ ఫోటోలు.. 

రష్మిక లేటెస్ట్ స్టిల్స్