అప్పుడే పెళ్లికి తొందర పడిపోయిన రాశిఖన్నా ప్రస్థుతం టాలీవుడ్ లో కెరీర్ మాంచి స్వింగ్ లో ఉంది పెళ్లి, గిల్లి అని ఆలోచించే టైమ్ లేదు కదా అంటున్న రాశిఖన్నా హీరోయిన్ కాకముందు పెళ్లి గురించి తెగ ఆలోచించేదట
తెలుగు తెరపై జెట్ స్పీడ్ లో దూసుకెళుతోన్న తారల్లో ఒకరు రాశీఖన్నా. ఈ పాతికేళ్ల సుందరి 23 ఏళ్లకే పెళ్లి చేసుకోవాలను కుందట. ఆ మాటలు స్వయంగా తనే చెప్తోంది. ఇప్పుడంటే సినిమాలు ఎక్కువై బిజీ అయిపోయి సెలెబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది కానీ... లేకుంటే ఎప్పుడో పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కనేదట.
తన పెళ్లి విషయం గురించి రాశీఖన్నా మాట్లాడుతూ – ‘‘చిన్నప్పుడు పెళ్లి గురించి నాకు చాలా కలలు ఉండేవి. 22 ముగిసి 23వ ఏట అడుగుపెట్టగానే పెళ్లి చేసుకోవాలనుకునేదాన్ని. ఏవేవో కలలు కనేదాన్ని. ఆ సంగతి ఇప్పుడు తలుచుకొంటే, నాకే నవ్వొస్తూ ఉంటుంది! మీకూ నవ్వొస్తోంది కదూ. అయితే, అందరం కలిసే నవ్వుకుం దామా’’ అని నవ్వులు పూయించింది. ఇప్పుడు మాత్రం రాశీకి కెరీర్ తప్ప పెళ్లి గిల్లి అనే ఆలోచనే లేదు. సినిమాల్లో హీరోలతోనే ఎంచక్కా రొమాన్స్ చేస్తుంటే ఇంకా పెళ్లి ఎందుకు అదో లొల్లి అనుకుంటూ అలా సాగిపోతోంది రాశి.
